మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు సంచలనం ఇంకా మరచిపోకముందే దాదాపు అలాంటిదే మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 2025 మేలో వెలుగుచూసిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు ఓ సంచలనం. మేఘాలయా హనీమూన్ మర్డర్‌గా కలకలం రేపిన ఆ ఉదంతం ఇంకా మర్చిపోకముందే దాదాపు అలాంటిదే మరో సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. కొత్త’గా పెళ్లి అయిన ఆశిష్, అంజూ అనే జంట గత నెల 30న శ్రీగంగానగర్‌లో ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆశిష్ అక్కడికక్కడే మరణించగా, అతడి భార్య అంజు స్ఫృహ కోల్పోయింది. వీరి పెళ్లి జరిగి మూడు నెలలు మాత్రమే అయ్యింది. ప్రమాదం జరిగిన తరువాత ఆమె మొబైల్, నగలు దోపిడీకి గురైంది. పోలీసులు మొదట దీనిని హిట్ అండ్ రన్ కేసుగా భావించారు.
అయితే దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. భార్య అంజూయే తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి అశిష్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో అంజు బాయ్ ఫ్రెండ్ తో పాటు మరో ఇద్దరి సహకారం కూడా ఉందని పేర్కొన్నారు. పోలీసుల కథనం మేరకు… గత నెల 30న రాత్రి 9 గంటల్లో స’మ’యంలో రోడ్డు ప్రమాదంలో ఓ జంట గాయపడిందంటూ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ జంటను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే ఆశిష్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుర్తు తెలియ ని వాహనం ఢీకొట్టడం వల్ల తన భర్త చనిపోయినట్లు భార్య అంజూ ఫిర్యాదు చేశారు. ఈవినింగ్ వాకింగ్ వెళ్లడంలో సమరి ఈ ప్రమాదం జరిగినట్లు ఆమె చెప్పింది. తాను ధ రించిన బంగారాన్ని దొంగలుకెళ్లినట్లు ఎత్తు కానీ ఈ కేసులో పోలీసులు కూపీ లాగారు. దర్యాప్తు సమయంలో అనుమానాలు రావడంతో అంజూను ప్రశ్నించారు.
ఆశిష్ శరీరంపై గాయాలు ఉండడము గొంతు తప్పనిసరిగా చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి కావడంతో పోలీసులకు అంజుపై అనుమానం పెరిగింది. ప్రమాదంలో అంజూకు ఎటువంటి గాయాలు తగల అనుమానం బలపడి అంజూ ఫోన్‌ను పోలీసులు స్కాన్ చేశారు. ఆమె తరుచూ సంజూ అనే వ్యక్తితో కాంటాక్టులో గుర్తించారు. దర్యాప్తులో అంజూ నేరం అంగీకరించింది. తన ’ఫ్రెండ్ సంజూ తో పాటు రోహిత్, బాదల్ అనే మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆశిష్ దారుణంగా కొట్టి, గొంతు హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు అంజు, సంజు, రోహిత్, బాదల్ లను అరెస్టు చేశారు.
.webp)