హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న సుధామ పీజీ అకామిడేషన్ ఫర్ ఉమెన్ హాస్టల్‌లో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది. హాస్టల్‌లోని ఒక గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ యువతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హాస్టల్‌లోని ఒక రూమ్‌కు సంబంధించిన వాష్‌రూమ్‌లో ఉన్న గీజర్ పేలిపోవడం వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
షార్ట్ కారణంగానే గీజర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. సమయంలో ఆ గది లోపల నుంచి లాక్ చేసి ఉండటం గమనార్హమని అధికారులు తెలిపారు.మంటల క్రమం గా పక్క రూమ్‌కు ప్రమాదం జరగడంతో హాస్టల్ అంతటా పొగ అలముకుంది. దీంతో అక్కడ యువతులు భయంతో పరుగులు తీశారు. అయితే పొగ, మంటల తీవ్రత ఎక్కు వగా ఉండటంతో ఇద్దరు యువతులు మెట్ల ద్వారా కిందకు దిగలేక హాస్టల్‌లోనే చిక్కుకున్నారు. ఈ ఘటనను గమనించిన పక్క హాస్టల్‌లో యువకులు అప్రమత్తమయ్యారు.
వెంటనే వారు సహాయక చర్యలకు దిగుతూ, నిచ్చెనే (లాడర్) సహాయంతో పై అంతస్తులో చిక్కుకున్న ఇద్దరు యువతులను సురక్షితంగా కిందకు దించారు. వారి సాహసోపేత చర్యల వల్ల పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు ప్రశంసిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో పాటు హైడ్రా సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. సుమారు గంట పాటు శ్రమించి అగ్ని మాపక సిబ్బంది మంటలను పూర్తిగా నియంత్రించారు.
ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగక పోయినా, హాస్టల్‌లోని ఒక గది పూర్తిగా దగ్ధమైంది. గీజర్, ఎలక్ట్రిక్ వైరింగ్‌తో పాటు గదిలోని సామగ్రి కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు పోలీసులు చేశారు. ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో, పీజీలు, హాస్టళ్లలో అగ్ని మాపక భద్రతా ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
