ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న సంగతి విధితమే. ఇదే నెల 14న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర వార్షిక పద్దుపై జోరుగా కసరత్తు చేస్తున్నారు. ఆయా శాఖల కేటాయింపులపై మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే నిన్న ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, టూరిజం శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, హోంమంత్రి వంగలపూడి అనితలతో బుధవారం (ఫిబ్రవరి 4) భేటీ అయ్యారు. ఈ భేటీలో వ్యవసాయ రంగానికి సముచిత ప్రాధాన్యం ఉంది. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని మరింత మెరుగుపర్చడానికి అన్న విధాలుగా సహాయం చేస్తాననీ పయ్యావుల కేశవ్ మంత్రులకు హామీ ఇచ్చిన ఆయా శాఖలు.
