Home సినిమా 16 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో అందరు ఈ పని చెయ్యాలి..సోను సూద్ డిమాండ్ – Andhra Waves

16 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో అందరు ఈ పని చెయ్యాలి..సోను సూద్ డిమాండ్ – Andhra Waves

by
0 comments
16 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో అందరు ఈ పని చెయ్యాలి..సోను సూద్ డిమాండ్




-ఉత్తరప్రదేశ్ లో చనిపోయిన పిల్లల విషయంలో ఏం చేయాలి
-సోను సూద్ చెప్పేది ఫాలో అవ్వాలా!
-ఆ టైం వచ్చిందా!
-సోను సూద్ ఇంతకీ ఏం చెప్తున్నాడు

‘బొమ్మాలి నిన్ను వదల’ అంటూ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త విలనిజాన్ని పరిచయం చేసిన వర్ స్టైల్ యాక్టర్ ‘సోను సూద్'(సోను సూద్). అలరించడమే కాదు ఆల్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ ని పోషించాడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బాషా బేధం తో సంబంధం లేకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పాన్ ఇండియా రియల్ హీరోగా కూడా గుర్తింపు పొందాడు. ఎప్పుడు ఆ రెండు విభాగాలకు సంబంధించి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచే సోను సూద్ ఇప్పుడు పదహేరేళ్ళ వయసు లోపు ఉన్న పిల్లల గురించి తీసుకోవల్సిన జాగ్రత్తలతో ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారాడు. ఆ డిటైల్స్ ఏంటో చూద్దాం.

రీసెంట్ గా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్(ఘజియాబాద్)లో ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసలైన ముగ్గురు మైనర్ యువతులు తమ వైడ్ పై నుంచి కిందకి దూకి చనిపోయిన ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచివేస్తుంది. ఈ విషయంపై సోను సూద్ ఎంతో ఆవేదనతో మాట్లాడుతు ‘సోషల్ మీడియా ప్రపంచంలో చిక్కుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు చనిపోవడం బాధాకరం. స్మార్ట్ ఫోన్ అనేది పిల్లల చేతుల్లో ఆయుధంగా మారుతుంది. వాటి వినియోగంపై నియంత్రణ లేకపోతే ఇలాంటి విషాదాలే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. మన బాల్యానికి ఇప్పుడు మార్గదర్శకత్వం అవసరం. చదువు కోసం తప్ప పదహారు సంవత్సరాల లోపు పిల్లలకి సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమింగ్ పై కఠినమైన రూల్స్ ని విధించే సమయం వచ్చింది. తల్లి తండ్రులు తమ పిల్లలు ఫోన్ లో ఏం చేస్తున్నారో గమనించాలి. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేలా చూడాలని సోను సూద్ ప్రభుత్వాలకి, ప్రజలకి విజ్ఞప్తి చేసాడు.


కూడా చదవండి: శృతి హాసన్ వల్ల ఒక పాప ప్రాణాలు సేఫ్.. ఆ పాప ఎవరో తెలుసా

చనిపోయిన ముగ్గురు అమ్మాయిలు స్వయానా అక్క చెల్లెల్లు. కొరియన్ కి చెందిన టాస్క్ ఆధారిత గేమ్ కి బానిస అయ్యి అందులో ఉన్న చివరి టాస్క్ ప్రకారం తొమ్మిదవ అంతస్థు నుంచి దూకి చనిపోయారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird