విపక్ష ఎంపీల ఆందోళన నేపథ్యంలో లోక్ సభ రేపటికి వాయిదా పడింది. స్పీకర్‌పై పేపర్లు విసిరిన 8 మంది ఎంపీలను పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు సస్పెండ్ చేశారు. ఈ మొత్తం సెషన్ వారిపై సస్పెన్షన్ అమల్లో ఉండనుంది. వీరిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌తోపాటు హిడీ ఈబెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఉన్నారు. నాలుగు నెలలుగా నిలిచిపోయిన భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై అకస్మాత్తుగా సంతకాలు జరగడంపై లోక్ సభ విపక్షనేత రాహుల్ ప్రధాని మోదీని ప్రశ్నించారు.
ఈ డీల్ వివరాలను వెంటనే దేశ ప్రజలకు వెల్లడించాలని రాహుల్ చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రేడ్ డీల్‌కు ఒప్పుకున్నారని రాహుల్. “దేశాన్ని అమ్మకానికి పెట్టారు. తన ఇమేజ్ దెబ్బతింటుందేమోననే భయంతో మోదీ వణుకుతున్నారు” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అదానీపై అమెరికాలో కేసు ఉంది. నిజానికి అది ప్రధానిపై ఉన్న కేసు. అలాగే ఎపిస్టీన్ ఫైల్స్‌లో కూడా కీలక విషయాలు ఉన్నాయి. వాటిని అమెరికా ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఈ రెండు అంశాలే మోదీపై ఒత్తిడిగా మారాయి. దేశం అర్థం చేసుకోవాలి” అని రాహుల్ గాంధీ చెప్పారు.
.webp)