తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం (ఫిబ్రవరి 2) గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం (ఫిబ్రవరి 3) నుంచి ప్రధాన పార్టీల ప్రచారం ప్రారంభం. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. అమెరికా పర్యటన నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులతో రెండు సార్లు జూమ్ సమావేశాలు జరిగాయి. ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.
ఇక బుధవారం (ఫిబ్రవరి 4) నుంచి ఆరు రోజుల జిల్లాలలో అదనంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయన తన మునిసిపల్ ఎన్నికల ప్రచారాన్ని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ప్రారంభించనున్నారు. 4న మిర్యాలగూడ, 5న చొప్పదండి, 6న నిజామాబాద్, 7న పరిగి, 8న భూపాలపల్లి, 9న మెదక్ జిల్లాల్లో సీఎం ముందుగా మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
