ప్రొఫెషనల్స్ పొలిటీషియన్స్ అయితే ఎంత ప్రమాదమో అయితే పొన్నవోలు ఒక ఉదాహరణ. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రభుత్వ వాదించిన సిద్దార్ధ లూథ్రాతో పాటు అప్పటి లాయర్ పొన్నవోలు కూడా ఫేమస్ అయ్యారు. వైసీపీలోనే మోస్ట్ పాపులర్ లాయర్ గా ఆయన అప్పట్లో ఎస్టాబ్లిష్ అయ్యారు.
బేసిగ్గానే వైసీపీ అంటేనే లీగల్ సెల్- లీగల్ సెల్ అంటేనే వైసీపీ. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డికి ఉన్న క్రైమ్ ట్రాక్ రికార్డును అనుసరించి.. ఏ సీనియర్ సుప్రీం కోర్టు లాయర్, లేదా సాధారణ జడ్జికన్నా తీసిపోని విధంగా సెక్షన్ల గురించి జగన్ కు క్షుణ్ణంగా తెలుసు. పొన్నవోలు కూడా అదే చెబుతారు. మాకు ఫలానా ఫలానా సెక్షన్లు ఉన్నాయనే తెలీదు. అదే జగన్ అలాక్కాడు.. అలాంటివి ఎన్నో మాకు ఎత్తి చూపుతూ.. వాటి ద్వారా ముందుకెళ్లమని ప్రోత్సహిస్తారని పొన్నవోలు పలు సందర్భాల్లో చెప్పారు.
కట్ చేస్తే.. ఇప్పుడు మేటరేంటంటే.. పొన్నవోలు వాదించడంతో బెయిలుపై బయటకు రావల్సిన అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలుకు వెళ్లారు. ఇందుకు పొన్నవోలు అత్యుత్సామే కారణమంటున్నారు. కారుమూరి వెంకటరెడ్డి విషయ వెంటనే బెయిలు ఇప్పించారు. అదే ఇప్పుడు అంబటి కాపు నేత కావడంతో రిమాండ్‌పై పంపించారన్న కోణంలో కొన్ని వాదనలు తెరమీదకు వస్తున్నాయి. ఇవాళారేపూ కుంభకోణాల’కన్నా ఇలాంటి కుల’కోణాలు ఎక్కువ కావాలంటే.. పొన్నవోలు టాలెంట్‌తో మాకు చావొచ్చి పడుతోంద’న్న ఆవేదన అంబటి వంటి వైసీపీ నేతలలో వ్యక్తమౌతోంది.
ఈయన ఏ కేసు ద్వారా వెలుగులోకి వచ్చారో ఆ కేసులో చంద్రబాబు పాత్రపై తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ సీఎం చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. పొన్నవోలు ప్రతాపం అంటే ఇదీ అంటున్నారు నెటిజనులు. తాము అధికారంలోకి వస్తే ఈ కేసులన్నిటినీ తిరగదోడుతామని వైసీపీ లీగల్ సెల్ లాయర్లు అంటున్నారనుకోండి అది వేరే సంగతి కానీ పొన్నవోలును నమ్ముకున్నందుకు మాకు జైలు ప్రాప్తమౌతోందంటున్నారు వైసీపీ నేతలు. మొత్తంగా కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మాత్రం పొన్నవోలు పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారు.
.webp)