Home Latest News తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు | తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. సామాజిక| పోస్ట్‌లు| సమర్థిస్తుంది| తెలంగాణాహైకోర్టు – Andhra Waves

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు | తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. సామాజిక| పోస్ట్‌లు| సమర్థిస్తుంది| తెలంగాణాహైకోర్టు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై తెలంగాణ హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు పోస్టులు పెట్టారని పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. ఈ కేసులను గతంలో విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు, ఆ ఐఆర్‌ కొట్టివేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్‌గా కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు సూచించింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమర్థించడమే కాకుండా మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమీ లేదని కొట్టివేసింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird