Home సినిమా మగజాతి ఆణిముత్యం ఎవరు.. వైరల్ గా మారిన న్యూస్ – Andhra Waves

మగజాతి ఆణిముత్యం ఎవరు.. వైరల్ గా మారిన న్యూస్ – Andhra Waves

by
0 comments
మగజాతి ఆణిముత్యం ఎవరు.. వైరల్ గా మారిన న్యూస్




-అల్లు శిరీష్ చెప్తాడా లేక ఎవరు చెప్తారు
-అధికారకంగా ఎప్పుడు చెప్పారు
-అసలేం జరుగుతుంది.
ఫ్యాన్స్ ఏమంటారో

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(అల్లు అర్జున్)సోదరుడిగా సెల్యులాయిడ్ పై కాలు మోపిన అల్లు శిరీష్(అల్లు శిరీష్)సినీ అనుభవం పన్నెండు సంవత్సరాలు. అంత లాంగ్ జర్నీ ని అనుభవంగా ఉంచుకొని ఇప్పటి వరకు ఏడూ సినిమాలు మాత్రమే చేసాడు. తన కట్ అవుట్, బడ్జెట్ కి తగ్గట్టుగా సరైన కథ కుదిరితేనే చేస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. 2024లో చేసిన ‘బడ్డీ’ తర్వాత మళ్ళీ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వలేదు. రీసెంట్ గా తన కొత్త చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి ‘టేక్ ఆఫ్’ అనేదే లేకుండా ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం.

అల్లు శిరీష్ తన నెక్స్ట్ మూవీ సోలో బతుకే సో బెటర్, బచ్చలమల్లి చిత్రాల ఫేమ్ సుబ్బు మంగాదేవి(సుబ్బు మంగాదేవి)దర్శకత్వంలో చెయ్యబోతున్నట్లుగా తెలుస్తుంది. పేర్కొన్న ‘మగజాతి ఆణిముత్యం ‘అనే టైటిల్ ఫిక్స్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ టైటిల్ నే వైరల్ గా మారింది.సదరు మగ జాతి ఆణిమత్యం టైటిల్ సోషల్ మీడియాలో 24 అవర్స్ ఆన్ డ్యూటీ అంటూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో వచ్చే అనేక ట్రోల్స్ కి పేటెంట్ వర్డ్. ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులకు మరింత దగ్గర కావడంతోపాటు కథ, కథనాలు కుదిరితే సినిమా భారీ హిట్ అవ్వడం ఖాయమనే మాటలు అభిమానుల నుంచి వినబడుతున్నాయి. అల్లు శిరీష్ ఫస్ట్ టైం రగ్గడ్ టైటిల్ తో చేస్తున్న మూవీ కూడా ఇదే.


ఇది కూడా చదవండి: అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది.. తలెత్తుకోలేని పరిస్థితి

కాకపోతే ‘మగజాతి ఆణిముత్యం'(మగజాతి ఆణిముత్యం)టైటిల్ తో పాటు సినిమా ఉన్నట్టుగా అధికార ప్రకటన అయితే రావాలి. హాస్య క్రి యేషన్స్ పై రాజేష్ దండ నిర్మించబోతున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. అల్లు శిరీష్ మార్చి 6 న నయనక రెడ్డి ని వివాహం చేసుకుంటున్న వివాహం తర్వాత ఆ ‘మగజాతి ఆణిముత్యం’ ప్రకటన వస్తుందా లేక పెళ్లికి ముందే ప్రకటన చేసి పెళ్లి అయ్యాక షూటింగ్ లో పాల్గొంటాడా అనేది చూడాలి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird