Home Latest News కేసీఆర్ సిట్ విచారణపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు| జస్టిస్ సుదర్శన్ రెడ్డి| సీఎం రేవంత్ రెడ్డి| ప్రొఫెసర్ కోదండరామ్| కేసీఆర్| కేటీఆర్| BRS పార్టీ| సిట్ విచారణ| శిబు సోరెన్| కాంగ్రెస్ పార్టీ| సి.పి.ఐ – Andhra Waves

కేసీఆర్ సిట్ విచారణపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు| జస్టిస్ సుదర్శన్ రెడ్డి| సీఎం రేవంత్ రెడ్డి| ప్రొఫెసర్ కోదండరామ్| కేసీఆర్| కేటీఆర్| BRS పార్టీ| సిట్ విచారణ| శిబు సోరెన్| కాంగ్రెస్ పార్టీ| సి.పి.ఐ – Andhra Waves

by andhra andhrawave
0 comments
కేసీఆర్ సిట్ విచారణపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు| జస్టిస్ సుదర్శన్ రెడ్డి| సీఎం రేవంత్ రెడ్డి| ప్రొఫెసర్ కోదండరామ్| కేసీఆర్| కేటీఆర్| BRS పార్టీ| సిట్ విచారణ| శిబు సోరెన్| కాంగ్రెస్ పార్టీ| సి.పి.ఐ


రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డుల వేడుకలను నేడు హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డును జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతు రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని.. నాడు ప్రజల కష్టాలు, రాచరిక పోకడలు, అరాచక చర్యలపై నారాయణరెడ్డి పోరాడారని కొనియాడారు.

స్వేచ్చనుండి, హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు వస్తుంది. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యమకారులు అని వాళ్లే చెప్పుకుంటున్నారు.. పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు జాతిపిత మహాత్మజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు గాంధీ ప్రాణాలు వదిలారని ముఖ్యమంత్రి అన్నారు. మరి ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా..ఆనాడు తలుపులు కొట్టి ఆయన్ను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా.. అప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా అని కేసీఆర్‌ను సీఎం ప్రశ్నించారు. పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా… నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని రేవంత్ అన్నారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని అన్నారు.

పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి.. హుందాగా తప్పుంటే కొంతైనా మీ గౌరవం నిలబడలేదు. అక్రమ మార్గం వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు.. శిబు సోరెన్ లాంటి వారు విచారణ ఎదుర్కొన్నారు. మనమేం దైవాంశ సంభూతులం కాదని ముఖ్యమంత్రి అన్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird