మాజీ మంత్రి జోగి రమేష్, రాము బెయిల్ రద్దు చేయడం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ నిందితులని వారికి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా 80 రోజులుగా జైల్లో ఉన్నవీరికి ఇటీవల న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
జోగి రమేష్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రోహిత్ వేసిన పిటిషన్‌పై కోర్టు వెల్లడించింది. రమేష్‌పై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేశారు.
.webp)