Home నేరం కేసీఆర్ అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్- మంత్రి వాకిటి శ్రీహరి – Andhra Waves

కేసీఆర్ అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్- మంత్రి వాకిటి శ్రీహరి – Andhra Waves

by
0 comments
కేసీఆర్ అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్- మంత్రి వాకిటి శ్రీహరి


తప్పు చేయకపోతే 42 హార్డ్ డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారు?
నిజాయితీపరుడైతే ట్యాపింగ్ కేసులో కడిగిన ముత్యంలా బయటకు రావాలి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కేసీఆర్ కు నిబద్ధత, నిజాయితీ ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కడిగిన ముత్యం బయటకు రావాలనిసవాల్ విసిరారు. తప్పు చేయకపోతే డిసెంబర్ 4న ఎస్ఐబీ ఆఫీస్‌లో సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ చేశారు? 42 హార్డ్ డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారు? అని నిలదీశారు. వందల ఫైళ్లను ఎందుకు నాశనం చేశారు? అని ప్రశ్నించారు. సీఎం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెచ్చి ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేయడం సాధ్యం కాదన్నారు. ఈ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సీఎల్పీ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ధ్వంసం చేసినట్లు. అదే వారు గెలిచి ఉంటే ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతూనే ఉండేదని. ప్రజల స్వేచ్ఛను, గౌరవాన్ని కాపాడడానికే సిట్ విచారణ జరుగుతోందన్న శ్రీహరి… ఎంతటి వారైనా చట్టాన్ని గౌరవించాల్సిందేనన్నారు. మీ కూతురు కవితే ట్యాపింగ్ చేసి ఫోన్ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యం నడుస్తుందని అనుకుంటున్నారు..ఇప్పుడు నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగమన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదన్నారు. ఇది దొంగతనాలు, హత్యల కంటే కూడా పెద్ద నేరమన్నారు. ఇది నేరుగా ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ పై జరిగిన ఘెరమైన దాడి అన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దేశంలోనే అత్యంత దుర్మార్గమైన చర్య అని తేలింది. దీంతో తెలంగాణ ప్రతిష్ట దేశవ్యాప్తంగా దిగజారిపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కక్షసాధింపు కోసం కాదన్న మంత్రి.. ఇది పూర్తిగా చట్టబద్ధమైన విచారణ. ఇవి ఆరోపణలు కావు.. పోలీసుల విచారణలో బయటపడ్డ నిజాలని చెప్పారు. ఈ స్థాయిలో ఆధారాలు లభించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. సామాన్య ప్రజల ఫోన్లు, వ్యాపారుల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, సినీనటుల ఫోన్లు, చివరికి భార్య భర్తల ఫోన్లు ట్యాప్ చేయడం నీచమన్నారు.

ట్యాపింగ్ దొంగల ముఠా నాయకులు కేసీఆర్…
కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ డ్రామా చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ట్యాపింగ్ దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని తెలిపారని, దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే రేవంత్ రెడ్డి భయపడతారా? అని ఉంది. ఇజ్రాయెల్ నుంచి ఎందుకు ట్యాపింగ్ పరికరాలు తెచ్చారు? అధికారం పోయాక ఎందుకు నాశనం చేశారు? కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫ్రెండ్ ఫోన్ ట్యాప్ చేసి 13 కోట్లు వసూలు చేశారు..బీజేపీ రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ లాంటి వారి ఫోన్లు ట్యాప్ చేశారు. సొంత అల్లుడి ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించాలని, తెలంగాణ ఆత్మగౌరవం అంటే బీఆర్ఎస్ కాదన్నారు. మీ పార్టీ పేరులో తెలంగాణ పదాన్ని తీసివేసిన దొంగలు మీరు.. తెలంగాణ ఆత్మ గౌరవం అంటే అమరవీరుల త్యాగాలు..ట్యాపింగ్ తో తెలంగాణ పరువు తీశారు..చంద్రమండలం పోయినా మిమ్మల్ని వదలమని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. బీజేపీ ట్యాపింగ్ కేసులో డ్రామాలు ఆడుతుంది.. కూలీ బ్యాచ్ ను పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కాంగ్రెస్ భయపడదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హెచ్చరిక.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird