ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు ప్రస్తుత కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్ అని తెలిపారు. కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభినందిస్తున్నాని ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్ సహకరించేలా ఉంది. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విదానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉందని ఆయన చెప్పారు.
మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా బడ్జెట్ ఉందని చంద్రబాబు అన్నారు. 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై, హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఉపయోగం ఉంది. తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్లలో కవర్ అవుతాయి అని ఆయన అన్నారు.
మన రాష్ట్రంలో అరకులో టూరిజం పెరగడానికి దోహదం చేస్తుంది.కోకోనట్, జీడి, కోకో, చందనం లాంటి పంటలకు ఊతమిచ్చేలా చర్యలు ఉంటాయి. డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ పెట్టారు. భారత్ డేటా సెంటర్ల హబ్ గా తయారవుతుంది. విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతున్నాయి..లాజిస్టిక్స్ రంగానికి ఏపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని ముఖ్యమంత్రి చెప్పారు.
.webp)