Home సినిమా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ భారీ చిత్రం! – Andhra Waves

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ భారీ చిత్రం! – Andhra Waves

by
0 comments
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ భారీ చిత్రం!



తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్దర్శకులుగా చెప్పుకోదగినవారిలో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఎన్నో విభిన్నమైన సినిమాలు, మరెన్నో ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన వాటిని సంపాదించుకున్నారు. ఒక విధంగా సినిమాలు రూపొందించడంలో సింగీతం చేసిన ప్రయోగాలు మరో డైరెక్టర్ చెయ్యలేదు అంటే అతిశయోక్తి కాదు. 94 ఏళ్ళ వయసులో కనిపించే ఒక యువకుడిలా ఆలోచించే ఆయన.. తన మనసులోని భావాలను తెరపై ఆవిష్కరించడంలో ప్రత్యేకతను చూపిస్తారు.

50 ఏళ్ళకు పైగా దర్శకుడిగా ఉన్న సింగీతం శ్రీనివాసరావుతో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. SSR61గా తెరకెక్కనున్న ఈ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ పర్యవేక్షిస్తారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.

సింగీతం శ్రీనివాసరావు నుంచి సినిమా వస్తోందంటే అది ఖచ్చితంగా విభిన్న కథాంశంతో, అంతకు మించిన వైవిధ్యంతో ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈసారి ఆయన ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో నందమూరి బాలక ష్ణతో చేసిన ఆదిత్య 369 పెద్ద విజయం సాధించడమే కాకుండా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రం సీక్వెల్ చేయబోతున్నారని ఎంతోకాలంగా వినిపిస్తున్నమాట.

ఇప్పుడు వైజయంతి మూవీస్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ సింగీతంతో సినిమా చేయబోతోందంటే ఆదిత్య 369కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. పాన్ ఇండియా మూవీస్, భారీ యాక్షన్ సినిమాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో సింగీతం శ్రీనివాసరావు లెజండరీ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తోందీ అంటే అది తప్పకుండా అందరి మనసుల్ని తాకే సినిమా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ చిత్రాలుగా చెప్పుకునే మాయాబజార్ వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో సింగీతం శ్రీనివాసరావు పనిచేశారు. సంగీతంలో కూడా ప్రవేశం ఉన్న సింగీతంకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అందుకే తన సినిమాల్లోని పాటలన్నీ ఎంతో మధురంగా ​​ఉంటాయి. 1972లో నీతి నిజాయతీ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సింగీతం.. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. చివరగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా 2013లో వచ్చిన వెల్‌కమ్ ఒబామా. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్న సింగీతం నుంచి మరో ద శ్యకావ్యం వస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దర్శకుల్లో 94 ఏళ్ళ వయసులోనూ తన 61వ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్న ఏకైక దర్శకుడు సింగీతం.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird