Home సినిమా జ‌న‌వ‌రి రివ్యూః భారీ అంచనాలు.. భారీ నష్టాలు. సంక్రాంతి సినిమాలకు తప్పని తిప్పలు! – Andhra Waves

జ‌న‌వ‌రి రివ్యూః భారీ అంచనాలు.. భారీ నష్టాలు. సంక్రాంతి సినిమాలకు తప్పని తిప్పలు! – Andhra Waves

by
0 comments
జ‌న‌వ‌రి రివ్యూః భారీ అంచనాలు.. భారీ నష్టాలు. సంక్రాంతి సినిమాలకు తప్పని తిప్పలు!



సంక్రాంతి పండగ అనేది తెలుగు సినిమాలకు ఎంతో ప్రత్యేకమైనది. మిగిలిన పండగలకు కూడా సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే ఈ పండగకు తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలని టాప్ హీరోలందరూ భావిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇది ఒక ఆనవాయితీగా మారింది. అంతేకాదు, సంక్రాంతి సీజన్‌లో తమ సినిమాలను విడుదల చేస్తే కలెక్షన్ల పరంగా కూడా మంచి రిజల్ట్ ఉంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే సంక్రాంతి సీజన్‌కి గతంలో ఉన్న వైభవం ఇప్పుడు కనిపించడం లేదు అనిపిస్తోంది.

గత మూడు సంవత్సరాలుగా సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు భారీ నష్టాలను చవిచూస్తూ ప్రేక్షకులను, అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. 2024లో గుంటూరు కారం, 2025లో గేమ్ ఛేంజర్, 2026లో రాజసాబ్ సినిమాలు సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన విజయాలు అందుకోలేకపోయాయి. ఈ ఏడాది రాజాసాబ్‌ని పక్కన పెడితే మూడు సినిమాలు పండగకు సందడి చేశాయి. ఆ మూడు సినిమాలూ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి.

జనవరి మొదటి వారంలో వనవీర, సైక్ సిద్దార్థ్, 45, గులాబీ వంటి సినిమాలు విడుదల అయినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. రీరిలీజ్‌గా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ కొన్ని చోట్ల బాగానే నడిచింది. జనవరి 9 నుంచి సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలైన రాజా సాబ్ మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏ వర్గం ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. టోటల్‌గా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది.

జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందించిన మన శంకర వరప్రసాద్‌గారు ఏరియాల్లో సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సంక్రాంతికి మెగాస్టార్‌ని విజేతగా నిలబెట్టిన సినిమా మన శంకరవరప్రసాద్‌గారు.

జనవరి 13న రవితేజ హీరోగా రూపొందించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి విడుదలైంది. ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా ఇటీవల కాలంలో రవితేజ చేసిన డిజాస్టర్స్ కంటే ఈ సినిమా కాస్త ఫర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్ల పరంగా చిరంజీవి సినిమా వల్ల రవితేజ సినిమాకి నష్టం జరిగింది. సంక్రాంతి సీజన్‌లో కాకుండా మరో డేట్‌కి రిలీజ్ చేసి ఉంటే బెటర్ సినిమా అయ్యేదని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందించిన అనగనగా ఒకరాజు సినిమా రిలీజ్ సంక్రాంతి పోటీలో మరో హిట్ సినిమాగా నిలిచింది. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా సక్సెస్ అయింది. సీసీస్‌లో ఆశించిన ఓవర్ స్థాయి విజయం సాధించకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. అలా జరగడానికి ముఖ్య కారణం సినిమాకి బడ్జెట్ పెరగడం. అలాంటి సబ్జెక్ట్‌ని మినిమం బడ్జెట్‌తో చేసి ఉంటే లాభాలు ఎక్కువగా కనిపించేవి. కానీ, హీరోయిన్‌ను మార్చడం, రీషూట్స్ చేయడం వంటి వాటివల్ల బడ్జెట్ పెరిగింది. అందుకే లాభాý శాతం తగ్గింది.

ఇక శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా పరిస్థితి కూడా అదే. ఇప్పటికే రాజాసాబ్, మన శంకరవరప్రసాద్‌గారు చిత్రాలకు భారీ థియేటర్లు కేటాయించారు. అనగనగా ఒక రాజు చిత్రం కూడా సూపర్‌హిట్ టాక్‌తో రన్ అవుతోంది. దీంతో శర్వానంద్ సినిమాకి థియేటర్లు కరువయ్యాయి. అందులోనూ ఈ సినిమాకి ఎక్కువ బజ్ లేకపోవడం వల్ల తక్కువ థియేటర్లలో రిలీజ్ అయి రోజురోజుకీ థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ హిట్ సినిమాగా మారింది.

సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు జనవరి చివరి వారం వరకు రన్ అయ్యాయి. చివరి వారం తరుణ్ భాస్కర్ రూపొందించిన ఓం శాంతి శాంతి చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. టో{ల్‌గా చూస్తే మన శంకరవరప్రసాద్‌గారు చిత్రం బ్లాక్‌బస్టర్ అవ్వగా అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి హిట్ సినిమాలు అనిపించాయి. అ ధర మించి రాజాసాబ్ మాత్రం భారీ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird