Home సినిమా మన శంకర వరప్రసాద్ గారు 50 రోజులు సాధ్యమేనా! ఆ హీరో ఫ్యాన్స్ ఏమంటున్నారు – Andhra Waves

మన శంకర వరప్రసాద్ గారు 50 రోజులు సాధ్యమేనా! ఆ హీరో ఫ్యాన్స్ ఏమంటున్నారు – Andhra Waves

by
0 comments
మన శంకర వరప్రసాద్ గారు 50 రోజులు సాధ్యమేనా! ఆ హీరో ఫ్యాన్స్ ఏమంటున్నారు




-తగ్గేదెలే అంటున్న మన శంకర వరప్రసాద్ గారు
-50 డేస్ సెంటర్స్ ఎన్ని
-అసలు 50 డేస్ ఆడుతుందా
-ఫ్యాన్స్ ఎన్ని సెంటర్లు చెప్తున్నారు

సెల్యులాయిడ్ వద్ద ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Varaprasad Garu)జోరు యదా రాజా, తదా ప్రజా అనే రీతిలో యదా మన శంకర వరప్రసాద్ గారు, తదా ప్రేక్షకులు లాగా కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పటికే 350 కోట్ల రూపాయల గ్రాస్ కి పైనే సాధించి సరికొత్త రికార్డులని సృష్టించబోతున్నానని బాక్స్ ఆఫీస్ సాక్షిగా చెప్తున్నాడు. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్ లు లాభాల బాట పడుట థియేటర్ పాటు థియేటర్ ల ఆక్యుపెన్సీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాకి అందని ద్రాక్షగా మారిన 50 రోజుల శంకర వర ప్రసాద్ ఎన్ని థియేటర్స్ లో జరుపుకుంటుందనే ఆసక్తి అందరిలో ఉంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానుల దృశ్యాలు మన శంకర వర ప్రసాద్ మూడో వారంలోకి దగ్గరవుతున్న థియేటర్లలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫ్యామిలీ సినిమా కావడం ప్లస్ పాయింట్. దీంతో ఆ కేటగిరి ఆడియన్స్ రాక మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు డెబ్భై థియేటర్లలో అయినా అర్ధశతదినోత్సవం జరుపుకునే అవకాశం ఉంది.ఈ సంక్రాంతికి రాజాసాబ్,నారి నారి నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు వచ్చాయి. ఈ సినిమాలు భారీ సంఖ్యలోనే థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. కాబట్టి మన శంకర వరప్రసాద్ కి హిట్ టాక్ రాగానే థియేటర్స్ కి వెళ్లి చూడటానికి ఎక్కువ థియేటర్లు లేవు. ఎక్కువ థియేటర్లలో ఉంటే చాలా మంది ప్రేక్షకులు త్వరగా మూవీని చూస్తారు.కాబట్టి ఈ సారి యాభై రోజులు జరుపుకోవడం ఖాయమని అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఇది కూడా చదవండి: గాంధీ టాక్స్ మూవీ రివ్యూ

ఇక మన శంకర వర ప్రసాద్ ఏ ముహూర్తాన కుదిరిందో గాని తెలుగు సినిమా తన తెలుగు కథల వైభవం ఇంకా బతికే ఉందని మురిసిపోతుంది. అచ్చ తెలుగు సినిమా ప్రేక్షకుడు కూడా అంతే ఆనందంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యాభై రోజుల వరకు తీసుకెళ్తారేమో చూడాలి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird