Home జాతీయం ఇక ఆఖరి మోఖా – Mudra News – Andhra Waves

ఇక ఆఖరి మోఖా – Mudra News – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఇక ఆఖరి మోఖా – Mudra News


ఇక ఆఖరి మోఖా
కేసీఆర్ కు చేరిన సిట్ నోటీస్
విచారణపై అంతా ఆసక్తి
ఆత్మగౌరవ పోరాటంగా బీఆర్ఎస్ కౌంటర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. హాజరవుతారా లేదా అన్నదానిపై ఇంకా బీఆర్ఎస్ ప్రకటన చేయలేదు. తెలంగాణను దశాబ్ద కాలం పాటు పాలించిన మాజీ కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ నెల 30న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, ఆయన వయస్సు రీత్యా సెక్షన్ 160 CrPC విచారణ ప్రకారం ఎక్కడ జరగాలనేది ఏంచుకునే వెసులుబాటును పోలీసులు కల్పించారు. జూబ్హిల్స్ పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా ఆయనకు అనువైన మరో ప్రదేశంలో గానీ విచారణకు సహకరించే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ నిర్ణయంపైనే ఉంది. ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన నిరసనను మౌనంగానే చాటుతారా, లేక ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో అధికారులను కలవాలని నిర్ణయించుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే హైదరాబాద్ పరిధిలోనే విచారణకు రావాల్సి ఉంటుంది.. బీఆర్ఎస్ భవన్ లేదా ..

విచారణకు హాజరవుతారా? వాయిదా కోరతారా?
కీలకమైన కేసుల్లో విచారణకు హాజరైన తమకేమీ తెలియదని సాధారణంగా ఆ ప్రక్రియను ముగించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వంటి నేతలు సిట్ ముందుకు వెళ్లి సుదీర్ఘంగా సమాధానాలిచ్చారు. అయితే కేసీఆర్ అడుగు ముందుకు వేసి, పోలీసుల మినహాయింపును పక్కన పెట్టి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కే వెళ్లే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం తనను వేధిస్తోందనే పొలిటికల్ విక్టిమ్ కార్డును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ భావిస్తోంది. ఒకవేళ ఆరోగ్య కారణాలు లేదా ఇతర విచారణల దృష్ట్యా వాయిదా కోరితే, అది ప్రభుత్వం చేతికి అస్త్రం ఇచ్చినట్లు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు.

ఎన్నికల మున్సిపల్ వేళ ఫోన్ ట్యాపింగ్’ అస్త్రం
తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. ఈ సమయం ఈ నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని బీఆర్ఎస్ నేతల వాదన . గత ప్రభుత్వ హయాంలో వేలాది ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఆ వ్యవహారం వెనుక పెద్దాయన ఉన్నారనే ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ముఖ్యంగా సింగరేణి బొగ్గు కుంభకోణం వంటి వారిపై ప్రతిపక్షం చేస్తున్న దాడిని తిప్పికొట్టడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసును పదునైన ఆయుధంగా వాడుకుంటోంది. విచారణ పేరుతో కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టడం ద్వారా బీఆర్ఎస్ క్యాడర్‌ను నైతికంగా దెబ్బతీయవచ్చనేది అధికార పక్షం వ్యూహంగా గుర్తించబడింది.

ఆత్మగౌరవ పోరాటంగా బీఆర్ఎస్ కౌంటర్
మరోవైపు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ నోటీసులను ‘తెలంగాణ ఆత్మగౌరవం’పై జరిగిన దాడిని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చిన నాయకుడిని నేరస్థుడిలా విచారించడం అంటే తెలంగాణను అవమానించడమేనని హరీష్ రావు వంటి నేతలు గట్టిగా వాదిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఈ కక్షసాధింపు చర్యలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వం తన దర్యాప్తు సంస్థల ద్వారా ‘కుట్ర కోణాన్ని’ బయటపెట్టాలని చూస్తుంటే, ఇటు బీఆర్ఎస్ దీనిని రాజకీయ వేధింపుల పర్వంగా మలిచి సానుభూతి పొందేందుకు సిద్ధమవుతోంది. మొత్తంమీద, జనవరి 30వ తేదీ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు కాబోతోంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird