Home Latest News మార్చి 3న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే? | తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత| మార్చి 3వ| చంద్రగ్రహణం| సేవాలు – Andhra Waves

మార్చి 3న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే? | తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత| మార్చి 3వ| చంద్రగ్రహణం| సేవాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తిరుమల శ్రీవారి ఆలయం వచ్చే నెల మూడు మూసి ఉంచనున్నారు. ఆ రోజు చంద్రగ్రహణం ఉండటంతో ఆలయాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచీ సాయంత్రం ఏడున్నర గంటల వరకూ ఆలయాన్ని మూసి ఉంచనున్నారు. చంద్రగ్రహణం మార్చి 3న సాయంత్రం మూడు గంటల ఇరవై నిముషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం ఆరుగంటల 47 నిమిషాలకు ముగుస్తుంది. చంద్రగ్రహణం ప్రారంభ సమయానికి ఆరుగంటల ముందే ఆలయాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

చంద్రగ్రహణం పూర్తిగా ముగిసిన తరువాత మార్చి 3 సాయంత్రం ఏడున్నర గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యవచనం నిర్వహించిన అనంతరం భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు. కాగా చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న అష్టదళ పాద పద్మారాధన సేవ , కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird