తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతరలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వన దేవత సమ్మక్క ఆగమనం అనంతరం భక్తులు గద్దెల వద్దకు చేరుకుంటున్న సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో లక్షలాది మంది భక్తులలో గందగరోళం. చిమ్మచీకటి కారణంగా భక్తులు ఎటువైపు వెళ్తున్నారో తెలియని పరిస్థితి.
తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో మంత్రి కాన్వాయ్ కూడా అక్కడ చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి కాన్వాయ్ పై దాడి జరిగిందన్న వార్తలు వెల్లువెత్తాయి. కాగా ఈ పరిస్థితిలో భద్రతా సిబ్బంది అప్రమత్తమై పెద్ద ప్రమాదం తప్పింది. కాగా మంత్రి కాన్వాయ్ పై దాడి విషయంలో పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై సమాచారం అందజేస్తున్నారు.
