మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరికాసేపట్లో ఫామ్ హౌస్‌కు వెళ్లేందుకు జరిగిన సమాచారం. ఈ భేటీలో సిట్ నోటీసులపై తీసుకో వాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా రేపు సిట్ ఎదుట హాజరువాలా? లేక విచారణకు సమయం కోరాలా? అనే అంశంపై ఇద్దరు నేతలు లోతైన చర్చ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. న్యాయపరమైన అంశాలు, ప్రభావాలు, తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే అంశంపైనా సమాలోచన జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే సిట్ దూ పెంచిన నేపథ్యంలో విచారణకు సంబంధించిన ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పరిశీలించాలనే అభిప్రాయంతో కేటీఆర్, హరీష్ రావుకు పార్టీలు చెబుతున్నాయి. విచారణ అధికారిని సంప్రదించి తగిన గడువు కోరారా? లేక నేరుగా హాజరైన తమ వాదనను వినిపించాలా? అన్న అంశంపై స్పష్టమైన నిర్ణయానికి రావడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
ఈ సమావేశం తర్వాత పార్టీ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండగా, కేటీఆర్–హరీష్ రావు తీసుకునే నిర్ణయం తెలంగాణ కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్లు కవిత స్పందించారు. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని. సిట్ పనితీరుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.