3

తెలంగాణ సైబర్ పోలీసులు కేరళ, కర్నాటకల్లో భారీ ఆపరేషన్ నిర్వహించి ఆరుగురిని అరెస్టు చేశారు. కేవలం వృద్ధులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్టు పేరుతో కోట్లాది రూపాయలు కొట్టేసిన సైబర్ నేరగాళ్ల ముఠాలోని ఆరుగురిని తెలంగాణ పోలీసులు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెడితే వృద్ధులను టార్గెట్ చేస్తూ డిజిట్ అరెస్టు పేరుతో పలువురి నుంచి దాదాపు 16 కోట్లు దాచుకున్న సైబర్ నేరగాళ్లకు సంబంధించి ఫిర్యాదులు అందుకున్న తెలంగాణ పోలీసులు సాంకేతికత ఆధారంగా వీరు కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో గుర్తించారు.
ఆ రాష్ట్రాల పోలీసులతో కలిసి రహస్య ఆపరేషన్ నిర్వహించిన హైదరాబాద్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేరళలో ముగ్గురిని కర్ణాటకలో ముగ్గురిని అరెస్టు చేసింది వారిని తరలించి విచారణ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. వృద్ధులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.