9

మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. గ్వానా జువాటో రాష్ట్రం సలమాంకా ఆసియా ఓ ఫుట్‌బాల్ మైదానంలో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. అక్కడి కమ్యూనిటీ ఫుల్ బాట్ గ్రౌండ్ మ్యాచ్ ముగిసిన తరువాత సాయుధులైన దుండగులు క్రీడాభిమానులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో 11 మంది మరణించారు, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన దుండగుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వారిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.