Home Latest News ఈ మూడు లక్షణాలు బలంగా ఉన్న వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే.. విజయం సాధించలేడట..! | మీ విజయావకాశాలను దెబ్బతీసే సాధారణ లక్షణాలు| ప్రజలు గొప్ప ఫలితాలను సాధించడాన్ని ఆపే విషయాలు| బలమైన వ్యక్తి కూడా లేకుండా విజయం సాధించలేడు – Andhra Waves

ఈ మూడు లక్షణాలు బలంగా ఉన్న వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే.. విజయం సాధించలేడట..! | మీ విజయావకాశాలను దెబ్బతీసే సాధారణ లక్షణాలు| ప్రజలు గొప్ప ఫలితాలను సాధించడాన్ని ఆపే విషయాలు| బలమైన వ్యక్తి కూడా లేకుండా విజయం సాధించలేడు – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఈ మూడు లక్షణాలు బలంగా ఉన్న వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే.. విజయం సాధించలేడట..! | మీ విజయావకాశాలను దెబ్బతీసే సాధారణ లక్షణాలు| ప్రజలు గొప్ప ఫలితాలను సాధించడాన్ని ఆపే విషయాలు| బలమైన వ్యక్తి కూడా లేకుండా విజయం సాధించలేడు


పోస్ట్ చేయబడింది జనవరి 27, 2026 3:47PM


ప్రతి వ్యక్తి తన జీవితంలో విజయం కోసం తహతహలాడుతూ ఉంటాడు. విజయం సాధిస్తే తన జీవితం సంతోషంగా ఉన్నట్టు లెక్క అనుకుంటాడు. ఎంత బలవంతుడు అయినా సరే.. మూడు లక్షణాలు చాలా బలంగా ఉంటే అది మనిషిని విజయానికి దూరం చేస్తుందని అంటున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి? అవి మనిషిని ఎందుకు విజయానికి దూరం చేస్తారు? తెలుసుకుంటే..

అనుబంధం..

మన కుటుంబ సభ్యులతో, సన్నిహితంగా, ఆత్మీయులతో అనుబంధం కలిగి ఉండటం చాలా మంచిదే. ఇది వ్యక్తుల మధ్య బంధాన్ని బలంగా మారుస్తుంది. కానీ మితిమీరిన అనుబంధం పెంచుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా మిగిలిన అన్ని విషయాల నుండి దృష్టి మరల్చుతాడు. దీని వల్ల ఆ వ్యక్తిలో ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత తెలివైన వారు అయినా.. విజయం సాధించలేరు.

ఈ పరిశీలన శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఎవరితో అయినా అనుబంధం ముఖ్యమే కానీ అది మితిమీరితే కొన్ని సార్లు వ్యసనంగా మారుతుంది. ఇదే మనుషులను విజయానికి దూరం చేస్తుంది.

అహంకారం..

అహంకారం ఉన్న మనిషి అధముడు అని పెద్దలు అంటారు. మనిషి అహంకారమే ఆ మనిషి వినాశనానికి దారి తీస్తుంది. ఎంత తెలివైన వ్యక్తి అయినా, ఎంత ధనవంతుడు అయినా అహంకారం ఉంటే విజయం సాధించలేడు.

అహంకారం ఉన్న వ్యక్తి ఏ బంధాలను కొనసాగించలేదు. అలాగే తన తప్పులను తెలుసుకోలేదు. తన తప్పులను తెలుసుకోలేని వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడు. ఎందుకంటే తప్పు చేసే వ్యక్తి ఎప్పుడూ తప్పు మార్గంలోనే ప్రయాణిస్తాడు. అలాంటి వ్యక్తికి విజయం చాలా దూరంలో ఉంటుంది.

సోమరితనం..

సోమరితనం విజయానికి పెద్ద అడ్డంకి. సోమరితనం ఉన్నవారు పనిని వాయిదా వేస్తూ ఉంటారు. కష్టపడి పని చేయడానికి సిద్దంగా ఉండరు.

కష్టపడి పని చేయడం, క్రమశిక్షణతో ఉండటం వల్ల మాత్రమే విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. ఆ లక్షణాలు లేని వారు విజయం సరిహద్దులను కూడా తాకలేరు.

*రూపశ్రీ



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird