జనవరి 27, 2026 10:01AMన పోస్ట్ చేయబడింది

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీలో వన్ నుంచి హండ్రాడ్ వరకూ అన్నీ ఆయనే అన్న చందంగా వ్యవహరిస్తుండటం, సీనియారిటీకి తగిన గుర్తింపు లేకపోవడం పట్ల వైసీపీలు అసంతృప్తితో రగిలిపోతున్నారన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయి, అప్పటి ప్రతిపక్ష, ప్రత్యర్థి పార్టీలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న వైసీపీ నాయకులకు మరో పార్టీలోకి వెళ్లే అవకాశం లేక, తప్పని సరి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగాల్సిన పరిస్థితి. అందుకే అధికారంలో ఉండగా నోటిని ఒక దూషణల కర్మాగారంగా మార్చుకుని మరీ చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు నోరు కట్టేసుకున్నారు. మాట్లాడడానికే జంకుతూ సైలెంటయిపో యారు.
అదాలా ఉంచితే.. వైసీపీ ఎకో సిస్టమ్ లో ప్రత్యర్థి పార్టీల నేతలతో మాట్లాడకూడదన్న అనధికార బ్యాన్ ఉంటుంది. అది జగన్ గీసిన లక్ష్మణ రేఖగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కనీసం ఘోర ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న పరాజయం తరువాత కూడా వైసీపీయులెవరూ కూటమి నేతలు తెలుగుదేశం పార్టీల నాయకులను కనీసం పలకరించను కూడా పలకరించరు. అయితే మౌనం, లేకుంటే తిట్ల పురాణం అన్నట్లుగా వారి తిరు ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే పార్టీలో ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ భయం నుంచి ఒక్కరొక్కరుగా బయటపడిన వైసీపీ నేతలు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా సోమవారం (జనవరి 26) గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు (ఎట్ హోం) అలా హాజరైన బొత్స సత్యనారాయణ.. ఈసారి హాజరైన తెలుగుదేశం జాతీయ కార్యదర్శి, మంత్రి లోకేష్ వద్దకు స్వయంగా వెళ్లి, కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించి ముచ్చటించారు. రెండు నిముషాలకు పైగా బొత్స సత్యనారాయణ నారా లోకేష్ తో సరదాగా ప్రసంగించారు. లోకేష్, బొత్స ఇరువురూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.
ఇదే ఇప్పుడు జగన్ అంటే వైసీపీ నేతలకు భయం పోయిందా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. ఎందుకంటే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీ నేతలు ప్రత్యర్థులతో మాట్లాడటం అసలు రుచించదు. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత శత్రువులేనన్నట్లుగా జగన్ భావిస్తున్నారు. వారితో తమ పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా, వాళ్లని దూరం పెడతారు. ఈ విషయం బొత్స సత్యనారాయణకు తెలియలేదు. గతంలో ఒక సారి జనసేనాని పవన్ కల్యాణ్ తో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆ పరిస్థితి ఎదుర్కొన్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయినా కూడా బొత్స సత్యనారాయణ లోకేష్ తో ఆత్మీయంగా పలకరించడం చూస్తుంటే.. జగన్ లెక్కేమిటన్నట్లుగా ఆయన వ్యవహరించినట్లు కనిపిస్తోందని వైసీపీ వర్గాలే అంటున్నాయి. అంతే కాదు.. ఇటీవల నియోజకవర్గ మార్పు విషయంలో మాజీ మంత్రి విడదల రజని కూడా తన అసంతృప్తిని ఒకింత బాహాటంగానే వ్యక్తం చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే పేర్ని నాని సైతం తమ పార్టీ అధికారంలో ఉండగా పాలనాపరంగా విఫలమవ్వడమే ఘోర పరాజయానికి కారణమని ఇటీవలే. వైసీపీపై జగన్ పట్టు సడలుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు చూస్తుంటే.
.webp)