జనవరి 27, 2026 9:15AMన పోస్ట్ చేయబడింది

అసెంబ్లీకే హాజరు కాని జగన్.. రిపబ్లిక్ డేకి వస్తారని ఎవరైనా ఎలా అనుకుంటారు. అసెంబ్లీకి రాణి ఎమ్మెల్యేలకు నోవర్క్.. నో పే విధానాన్ని అమలులోకి తెచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదిస్తున్నారు. అయితే ఆ విషయం వైసీపీ అధినేత జగన్ కు మాత్రమే కాదు, ఆయన తో పాటు పది మంది ఎమ్మెల్యేలకూ చెవికెక్కడం లేదు. ఇప్పటికే ఎథిక్స్ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసి స్పీకర్ కి సిఫార్సు చేసింది. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే వారిని అనర్హులగా ప్రకటించాలని ఎథిక్స్ కమిటీ సూచించింది.
బేసిగ్గా జగ’న్ కు అధికారం విన మరేం అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తారు. ఆయన గతంలో సీఎం కుమారుడు, ఇప్పుడు మాజీ సీఎం. ఈ నేపథ్యంలోనే ఆయన తనకొన సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వ్యవహరిస్తారు. అన్యమతస్థులు తిరుమల దేవుడిని దర్శనం చేసుకునే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధనను ఖాతరు చేయకుండా డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల వెంకన్న దర్శనానికి కారణం కూడా జగన్ సొంత రాజ్యాంగమేనని పరిశీలకుల విశ్లేషణ.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఎలాగో జగన్ వ్యవహారశైలి కూడా అలాగే ఉంటుంది. నియంతగా ఆయన తీరు ఉంటుంది. పొర’బాటున జగ’న్ గానీ ఆంధ్ర’ప్రజ’ల అదృష్టం బాగోలేక వరుసగా రెండో సారి కూడా సీఎం అయి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఉత్తరకొరియాకన్నా ఘోరంగా తయారై ఉండేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్టు జగన్ లాంటి సైకిక్ డిజార్డర్ గల వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడటం అనవసరం అన్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ వైబీ వెంకటేశ్వరరావు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ మళ్లీ తాను వస్తానని అంటున్నారనీ, ఇంకా మాట్లాడితే రప్పారా అంటున్నారని తెలుస్తోంది. అలాంటి వ్యక్తి రిపబ్లిక్ డే వేడుకలకు వస్తారని ఎవరూ అనుకుని ఉండరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలపడం కూడా జగన్ అహంకారానికి నిదర్శనంగా చెబుతున్నారు.
