పోస్ట్ చేయబడింది జనవరి 26, 2026 5:38PM

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని లోక్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు నేతలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. నేతల మధ్య సరదా సంభాషణలతో లోక్ భవన్ ప్రాంగణ ఆహ్లాదకర వాతావరణం అంతా. అనంతరం గవర్నర్, సీఎం చంద్రబాబు స్వాతంత్య్ర సమరయోధులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. మంత్రి నారా లోకేశ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇద్దరూ అప్యాయంగా మాట్లాడుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పద్మ పురస్కార గ్రహీతలు, కళాకారులు, క్రీడాకారులతో ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా లోక్ భవన్‌ను విద్యుత్ దీపాల అలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న అధిపతులంతా ఒకేచోట చేరిన ఈ కార్యక్రమం, రాష్ట్రంలో పరిపాలన సామరస్యాన్ని ప్రతిబింబించింది.
గత ఏడాది కాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతి, గణతంత్ర స్ఫూర్తి గురించి పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్‌కు నేతలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. నేతల రాకతో లోక్‌భవన్ సందడిగా మారింది.
