Home Latest News పద్మ అవార్డుల్లో దక్షిణాదికి ప్రాధాన్యత | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం| పద్మశ్రీ అవార్డు| కేంద్ర ప్రభుత్వం| పద్మవిభూషణ్| పద్మ భూషణ్| ధర్మేంద్ర సింగ్ దేవల్| VS అచ్యుతానంద| ఎన్. రాజం| పి. నారాయణన్| మాగంటి మురళీ మోహన్| మామిడాల జగదీష్ కుమార్| సీఎం చంద్రబాబు| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

పద్మ అవార్డుల్లో దక్షిణాదికి ప్రాధాన్యత | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం| పద్మశ్రీ అవార్డు| కేంద్ర ప్రభుత్వం| పద్మవిభూషణ్| పద్మ భూషణ్| ధర్మేంద్ర సింగ్ దేవల్| VS అచ్యుతానంద| ఎన్. రాజం| పి. నారాయణన్| మాగంటి మురళీ మోహన్| మామిడాల జగదీష్ కుమార్| సీఎం చంద్రబాబు| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
పద్మ అవార్డుల్లో దక్షిణాదికి ప్రాధాన్యత | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం| పద్మశ్రీ అవార్డు| కేంద్ర ప్రభుత్వం| పద్మవిభూషణ్| పద్మ భూషణ్| ధర్మేంద్ర సింగ్ దేవల్| VS అచ్యుతానంద| ఎన్. రాజం| పి. నారాయణన్| మాగంటి మురళీ మోహన్| మామిడాల జగదీష్ కుమార్| సీఎం చంద్రబాబు| సీఎం రేవంత్ రెడ్డి


జనవరి 26, 2026 3:55PMన పోస్ట్ చేయబడింది


గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. 2026 సంవత్సరానికి గాను విడుదల చేసిన వివిధ రంగాలకు చెందిన మొత్తం 131 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు లభించాయి.

ఈ జాబితా
➡️ 5 పద్మవిభూషణ్,
➡️ 13 పద్మభూషణ్,
➡️ 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.

ఈసారి అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా, 16 మందికి మరణాంతరం పురస్కారాలు ప్రకటించారు. విదేశీయులు, ఎన్నారై ఎంపిక ఆరుగురు ఎంపికయ్యారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, వైద్యం, సాహిత్యం వంటి రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ గౌరవాలు దక్కాయి.

పద్మవిభూషణ్ – దేశానికి అసాధారణ సేవలు

దేశానికి అసాధారణ సేవలందించినందుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఈసారి ఐదుగురు అందుకోనున్నారు.

▪️ ధర్మేంద్రసింగ్ దేవల్ – కళలు (మరణానంతరం, మహారాష్ట్ర)
▪️ వి.ఎస్. అచ్యుతానందన్ – ప్రజా వ్యవహారాలు (మరణానంతరం, కేరళ)
▪️ కె.టి. థామస్ – ప్రజా వ్యవహారాలు (కేరళ)
▪️ ఎన్. రాజమ్ – కళలు (ఉత్తరప్రదేశ్)
▪️ పి. నారాయణన్ – సాహిత్యం & విద్య (కేరళ)

పద్మభూషణ్ – విశిష్ట సేవలకు గాను

పద్మభూషణ్ జాబితాలో ఈసారి 13 మంది ప్రముఖులకు చోటు దక్కింది.

▪️ గాయని అల్కా యాగ్నిక్
▪️ మలయాళీ నటుడు మమ్ముట్టి
▪️పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్
▪️ మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ
▪️ టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్
▪️ ప్రకటన రంగ దిగ్గజం పియూష్ పాండే (మరణానంతరం)

తెలుగు రాష్ట్రాలకు పద్మ పంట

ఈసారి పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక గౌరవం లభించింది.

🔹 ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ

▪️ మాగంటి మురళీమోహన్‌ – కళలు
▪️ గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ – కళలు
▪️ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ – కళలు (మరణానంతరం)
▪️ వెంపటి కుటుంబ శాస్త్రి – సాహిత్యం & విద్య

🔹 తెలంగాణ నుంచి పద్మశ్రీ

▪️ దీపికా రెడ్డి – కూచిపూడి నృత్యం (కళలు)
▪️ గూడూరు వెంకట రావు – వైద్య రంగం
▪️ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి – వైద్య రంగం
▪️ చంద్రమౌళి గడ్డముణుగు – సైన్స్–ఇంజనీరింగ్
▪️ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ – సైన్స్–ఇంజనీరింగ్
▪️ కుమారస్వామి తంగరాజ్ – సైన్స్–ఇంజనీరింగ్
▪️ రామారెడ్డి మామిడి – పశుసంవర్థక రంగం (మరణానంతరం)

అలాగే యూజీసీ మాజీ చైర్మన్‌, నల్గొండ జిల్లాకు చెందిన మామిడాల జగదీశ్ కుమార్‌కు సాహిత్యం–విద్య రంగంలో పద్మశ్రీ వరించింది.

క్రీడా, సినీ రంగాలకూ గౌరవం

క్రీడా రంగం నుంచి
▪️ రోహిత్ శర్మ,
▪️ హర్మన్‌ప్రీత్ కౌర్,
▪️ సవితా పునియాలకు పద్మశ్రీ లభించింది.

సినీ రంగం నుంచి
▪️ ప్రోసెన్‌జిత్ ఛటర్జీ,
▪️ సతీష్ షా (మరణానంతరం),
▪️ అనిల్ కుమార్ రస్తోగి ఈ జాబితాలో ఉన్నారు.

ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird