పోస్ట్ చేయబడింది జనవరి 26, 2026 3:07PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో ఎస్సీ గురుకుల హాస్టల్‌లో చోటు చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని సంగీత ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. హాస్టల్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సునీత తన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కోసం గురుకుల పాఠశాల ఆసుపత్రిని ఆటోలో తరలించిన సమాచారం. ఈ పనిలో భాగంగా సుమారు 30 కుర్చీలు ఆటోలో తీసుకెళ్లి అన్‌లోడ్ చేసిన అనంతరం, అదే ఆటోలో నలుగురు విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు బయలుదేరారు.
ఆటో డ్రైవర్ రాష్‌గా వాహనం నడుపుతుండగా, డ్రైవర్ గమనించకుండా అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు కిందికి దూకినట్లు పోలీసులు తెలిపారు. చివరగా దూకిన సంగీత తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై సంగీత తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సునీత నిర్లక్ష్యం వల్లే మా కూతురు ప్రాణాలు కోల్పోయింది” అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గురుకుల పాఠశాలలో జరిగిన ఈ విషాద ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిగిందని స్పష్టం చేశారు. మరోవైపు సంగీత మృతి పట్ల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్‌గ్రేసియా ప్రకటించింది. ప్రభుత్వం వారికి అన్ని విధాల అండగా ఉంటుందని పోచారం భరోసా ఇచ్చారు.
