Home ఆంధ్రప్రదేశ్ పుర’పోరులోనూ కాంగ్రెస్ దే విజయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – Andhra Waves

పుర’పోరులోనూ కాంగ్రెస్ దే విజయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – Andhra Waves

by
0 comments
పుర'పోరులోనూ కాంగ్రెస్ దే విజయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి


అన్నీ మున్సిపాలిటీలు హస్తగతం చేసుకుంటాం
నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ నేతలతో భేటీ

ముద్ర, నిజామాబాద్ :

వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. అంతకు ముందు త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ గత ఎన్నికల ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్, బీజేపీలకు అనుకూలంగా ఉన్న నిజామాబాద్ లోనూ ఈ సారి స్ధానిక కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఆదివారం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్, మెట్‌పల్లి, కోరుట్ల పురపాలక సంఘాల పార్టీ సమన్వయ సమావేశాలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై విశ్వసనీయతను పెంపొందించాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధిని అమలుజరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకపోయేందుకు పార్టీ లీడర్, క్యాడర్ కృషి ముందుకు రావాలని ఆయన ముందున్నారు. రానున్న పురపాలక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన ముందుకు వచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ పురపాలక సంఘం మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. పార్టీ వారి సర్వేల ఆధారంగా టికెట్లు ఖరారు చేస్తామన్నారు. సర్వేతో పాటు విధేయత,చిత్తశుద్ధి, క్రమశిక్షణ ల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అవకాశం రాని వారికి ప్రత్యమ్నాయ అవకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ కోసం శ్రమించే ప్రతీ ఒక్కరికీ అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. జరుగుతున్న అభివృద్ధికి మరిన్ని నిధులు అందించి పట్టణ ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలన్నారు. అర్హులైన నిరుపేదలకు యావత్ భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird