Home Latest News హరీష్ రావును గుంట నక్కతో పోల్చిన కవిత | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత| నైని కోల్ బ్లాక్ టెండర్| హరీష్ రావు| కేటీఆర్| కేసీఆర్| BRS పార్టీ| టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్| కాంగ్రెస్ పార్టీ – Andhra Waves

హరీష్ రావును గుంట నక్కతో పోల్చిన కవిత | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత| నైని కోల్ బ్లాక్ టెండర్| హరీష్ రావు| కేటీఆర్| కేసీఆర్| BRS పార్టీ| టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్| కాంగ్రెస్ పార్టీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
హరీష్ రావును గుంట నక్కతో పోల్చిన కవిత | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత| నైని కోల్ బ్లాక్ టెండర్| హరీష్ రావు| కేటీఆర్| కేసీఆర్| BRS పార్టీ| టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్| కాంగ్రెస్ పార్టీ


పోస్ట్ చేయబడింది జనవరి 25, 2026 4:22PM


బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేటీఆర్‌ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఐఏఎస్ మీద ఇష్టానుసారంగా రాసిన జర్నలిస్టులకు ఆయన ఎలా సహకరిస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ మీద ఓ ఛానల్ వార్త రాస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లి దాడి చేశారు. ఇప్పుడు ఓ శాటిలైట్ ఛానల్ ప్రతినిధులకు ఎందుకు సహకరిస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని కవిత నిలదీశారు. మేఘా అనే తిమింగళాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతోందని ఆమె. సింగరేణి కాంట్రాక్ట్ ల విషయంలో సృజన్ రెడ్డి చిన్న చేప..మేఘా కృష్ణారెడ్డికి రూ. 25 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని దాని మీద బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని కవిత నిలదీశారు.

కార్మికులకు కష్టం వస్తే కాంగ్రెస్, బీఎస్‌లు పట్టించుకోవడం లేదని..పెద్ద కాంట్రాక్టర్‌ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్దేశించి. గతంలో సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్ట్ లు ఇచ్చారు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బావమరది అని గుర్తుకు రాలేదా? సింగరేణి విషయంలో బీఆర్ఎస్ డొల్లతనాన్ని మేము చూస్తున్నామని చెప్పారు. గుంటనక్క ప్రెస్ మీట్‌ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తానికి నైనీ కాంట్రాక్ట్ రద్దు ప్రకటించారు. అయితే ఇక్కడ విచిత్రాలు జరుగుతున్నాయని కవిత అన్నారు. హరీష్ రావు మొత్తం దళిత కమ్యూనిటీనే అవమానపరిచే విధంగా భట్టి విక్రమార్కకి లేఖ రాయను అంటున్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మాత్రమే ఆయన లెటర్ రాస్తారా? అసలు సింగరేణిలో ఎండీవో అనే సిస్టమ్ పెట్టారు. అది ఉండకూడదని ఆమె అన్నారు. కిషన్ రెడ్డి ఈ బ్లాక్ కు సింగరేణికి వచ్చేలా కృషి చేయాలి..రూల్స్ అనకుండా వచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నం మనకు కవిత డిమాండ్ చేశారు.గతంలో గుజరాత్ కు బొగ్గు బ్లాక్ లను తీసుకొని పోయిన ఘటనలు లేవా? కిషన్ రెడ్డి తెలంగాణ కోసం చేయకపోతే బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి ఏం లాభమని ఆమె అన్నారు. తర్వలోనే సింగరేణిలో ఎన్నికలు రాబోతున్నాయి.

ఇప్పటి వరకు డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నా పనుల కోసం. నేను కాంగ్రెస్‌కు వస్తానంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్దన్నానంటూ చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లూజింగ్ పార్టీ అని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే పార్టీయే జాగృతి పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్ అనుభవం ప్రకారం ఆయనకే నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తామని కవిత తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిపోయింది. రెండేళ్లుగా సీరియల్ గా సాగదీస్తున్నారు. నా లాంటి బాధితులకు మేలు చేయటం లేదని కవిత అన్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird