Home Latest News నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల దుర్మరణం | నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి| నాగర్ కర్నూల్ జిల్లా| ఊరుకొండ మండలం| ముచ్చర్లపల్లి గ్రామం| స్నేహ| సిరి| బోర్‌వెల్స్| తెలంగాణ పోలీసులు| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల దుర్మరణం | నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి| నాగర్ కర్నూల్ జిల్లా| ఊరుకొండ మండలం| ముచ్చర్లపల్లి గ్రామం| స్నేహ| సిరి| బోర్‌వెల్స్| తెలంగాణ పోలీసులు| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల దుర్మరణం | నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి| నాగర్ కర్నూల్ జిల్లా| ఊరుకొండ మండలం| ముచ్చర్లపల్లి గ్రామం| స్నేహ| సిరి| బోర్‌వెల్స్| తెలంగాణ పోలీసులు| డీజీపీ శివధర్ రెడ్డి


పోస్ట్ చేయబడింది జనవరి 25, 2026 5:23PM


నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో ముగ్గురు చిన్నారుల మృతి ఘటన పలువురి హృదయాలను కదిలించి వేసింది.. నానమ్మ ఇంటికి వచ్చిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు పొలం వద్ద ఉన్న నీటికుంటలో పడిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణాల్లో ముగ్గురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలకు చెందిన స్నేహ (15), ముచ్చర్లపల్లికి చెందిన సిరి (14), శ్రీమన్యు (14) సెలవుల సందర్భంగా నానమ్మను చూసేందుకు గ్రామానికి వచ్చారు. గ్రామ పరిసరాల్లో పొలాల వద్ద ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్నారని అందులో ఒకరు ప్రమాదవశాత్తు పొలం పక్కన ఉన్న లోతైన నీటి కుంటలో పడిపోయారు. సహజమైన స్నేహబంధంతో ఆమెను కాపాడాలన్న ఆరాటంలో మిగిలిన ఇద్దరూ కుంటలోకి దిగారు. అయితే ఆ కుంటలో ఉన్న ఊబి, లోతు కారణంగా ముగ్గురూ బయటకు రావలేకపో యారు.

సహాయం కోసం కేకలు వేసే అవకాశం కూడా లేకుండా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఊపిరాడక ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కొంతసేపటికి పిల్లలు కనిపించే కుటుంబసభ్యులు వెతకగా… నీటిపై తేలుతూ కనిపించిన చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువుల గుండెలు పగిలేలా విలపించారు. తమ కళ్ల ముందే భవిష్యత్తు అంతా చెదిరిపోవడంతో ఆ కుటుంబ రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది.
భవిష్యత్తు కలలు కంటున్న తల్లిదండ్రులకు తీరని విషాదం పిల్లలు చదువుల్లో రాణించి ఉన్నత స్థితికి చేరుకోవా లన్న తల్లిదండ్రుల ఆశలు ఒక్కసారిగా చిద్రం అయ్యాయి.

సెలవులు పూర్తయ్యాక తిరిగి పట్నం వెళ్లి చదువులు కొనసాగించాల్సిన చిన్నారులు… ఇలా అనంత లోకాలకు వెళ్లిపో వడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు కావడంతో విషాద తీవ్రత పెరిగింది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పొలాల వద్ద ఉన్న నీటి కుంటలు, బోరుబావులు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో రైతులు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిల్లలను కుంటలు, లోతైన ప్రాంతాల వద్దకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషాద ఘటనతో ముచ్చర్లపల్లి గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird