జనవరి 25, 2026 10:18AMన పోస్ట్ చేయబడింది

హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 20 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. భవనంలోని సెల్లార్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గోడలకు రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించిన బృందాలు, ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో బేబీ అనే మహిళ మృతదేహం వెలికితీత తీశారు
సెల్లార్ మొత్తం ఫర్నీచర్‌తో నిండి ఉంది, దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఉంది. ఈ లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది ప్రాణాల్ని పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం గడుస్తున్నా భవనంలో చిక్కుకున్న ఐదుగురి ఆచూకీ ఇంకా తెలియకుండానే కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన. తమ వారి ఆచూకీ తెలపాలని బంధువులు రోదిస్తున్నారు. పోలీసుల నుండి సరైన సమాధానం లభించిన బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
