జనవరి 25, 2026 9:56AMన పోస్ట్ చేయబడింది

యూఎస్‌ను భారీ మంచు తుపాను అతలాకుతలం చేసింది. దాని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీగా మంచు, వర్షంతో పాటు కనిష్ఠ ఉష్ణోగగ్రతలు నమోదవుతున్నాయి. ఈ భీకర తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం నాటి 3,200 విమానసర్వీసులు, ఆదివారం తిరగాల్సిన 4,800 సర్వీసులు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ అవేర్ చూసింది.
ఈ పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో పెద్దసంఖ్యలో రవాణా సర్వీసులకు అంతరాయం కలగొచ్చని అంచనా వేస్తున్నారు. మంచు తుపాను అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలపై ప్రభావం చూపనుందని అధికారులు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. దాతో కెంటకీ, వర్జీనియా, కాన్సస్, అర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాలు ఎమర్జెన్సీ విధించాయి.
మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రమాదకర చలి వాతావరణం ఉంటుందని, మిస్సోరి ఇల్లినోయీలలో భారీ మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా అనేక ప్రాంతాల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, వాహనదారులు మంచులో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరికలు జారీ చేశారు. ఇది ఈ దశాబ్దంలోనే అతి తీవ్రమైన తుపాను అంటున్నారు.
