Home Latest News అస్తమించని అగ్నికణం ‘పరిటాల రవి’ | పరిటాల రవి వర్ధంతి| వెంకటాపురం గ్రామం| పరిటాల శ్రీరాములు| నక్సలైట్| కమ్యూనిస్టు పోరాటం| గంగుల నారాయణ రెడ్డి| పరిటాల సునీత| మద్దెలచెరువు సూరి| వైఎస్ జగన్|పెనుగొండ ఎమ్మెల్యే| కారు బాంబు దాడి| సీఎం చంద్రబాబు – Andhra Waves

అస్తమించని అగ్నికణం ‘పరిటాల రవి’ | పరిటాల రవి వర్ధంతి| వెంకటాపురం గ్రామం| పరిటాల శ్రీరాములు| నక్సలైట్| కమ్యూనిస్టు పోరాటం| గంగుల నారాయణ రెడ్డి| పరిటాల సునీత| మద్దెలచెరువు సూరి| వైఎస్ జగన్|పెనుగొండ ఎమ్మెల్యే| కారు బాంబు దాడి| సీఎం చంద్రబాబు – Andhra Waves

by andhra andhrawave
0 comments
అస్తమించని అగ్నికణం 'పరిటాల రవి' | పరిటాల రవి వర్ధంతి| వెంకటాపురం గ్రామం| పరిటాల శ్రీరాములు| నక్సలైట్| కమ్యూనిస్టు పోరాటం| గంగుల నారాయణ రెడ్డి| పరిటాల సునీత| మద్దెలచెరువు సూరి| వైఎస్ జగన్|పెనుగొండ ఎమ్మెల్యే| కారు బాంబు దాడి| సీఎం చంద్రబాబు


పోస్ట్ చేయబడింది జనవరి 24, 2026 5:47PM


పరిటాల రవి .. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు… ఏ అండ లేని సామాన్యుడికి ఒక భరోసా. జీవితమంతా ఫ్యాక్షన్ మీద రాజీ లేని పోరు సాగించిన చరితార్థుడు. పీడిత వర్గాల గుండెచప్పుడు దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతి నేడు. 2005 జనవరి 24 యావత్తు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసి, అట్టుడికి పోయేలా చేసిన దుర్దినం. రాజకీయ ప్రత్యర్ధులు పన్నిన కుట్రతో జనవరి 24న టీడీపీ ప్రారంభ కిరాయి మూకల కాల్పుల్లో హతమయ్యారు.

పరిటాల రవీంద్ర జన్మించారు 1958 ఆగస్టు 30 నారు. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయితీ శివారు వెంకటాపురం. ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీకి నక్సలైటు ఉద్యమానికి పుట్టినిల్లు పరిటాల రవీంద్ర యిల్లు. తండ్రి పరిటాల శ్రీరాములు నక్సలైటు. ఊహ తెలిసినప్పటి కమ్యూనిస్టు పోరాటాల్లో రాటుదేలిన యోధుడు.

1975లో భూస్వాములు, ఫ్యాక్షనిస్టులు కుట్రపన్ని పరిటాల శ్రీరాములు, అయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని దారుణంగా హత్య చేశారు. తండ్రి చనిపోయేనాటికి పరిటాల రవీంద్ర వయసు పదిహేను సంవత్సరాలు. కన్నబిడ్డల కోసం గుండెను బండరాయిలా చేసుకుని బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డారు. తమ్ముడు హరితో పటు ఆహోరాత్రాలు శ్రమించి తండ్రి తాలుకు అప్పుల్ని తీర్చేశారు.

తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరి బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించాడు. ఆ కావలసిన భూస్వాములు, ఫ్యాక్షనిస్టులు పరిటాల రవి మీద దృష్టిని సారించారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది. పరిటాల శ్రీరామ హత్య కుట్ర దారుడు మద్దెలచెరువు గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గంగుల నారాయణ రెడ్డిని 1983లో పీపుల్స్‌వార్ కాల్చి చంపారు. ఈ హత్యకేసులో పరిటాల రవిని ప్రధాన నిందితుడిగా చేర్చారు.

అప్పట్లో అజ్ఞాత జీవితం గడుపుతూనే తన కుటుంబానికి బాసటగా వుంటూ వచ్చిన పరిటాల రవి జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కొంగ్రెసేతరఏతర ప్రభుత్వాని స్థాపించి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఆ అంచనా1984లో పరిటాల రవీంద్ర అజ్ఞాతం వీడి తన స్వగ్రామం చేరుకున్నారు. 1984 అక్టోబర్ 27న దర్మవరుపు కొండన్నపెద్ద కుమార్తె సునీతతో పరిటాల రవి పెళ్లి జరిగింది.

అప్పట్లో పరిటాల శ్రీరాములు హత్యకేసులో ప్రధాన ముద్దాయి సిద్దప్ప శిక్ష ముగించుకుని జైలునుంచి బైటకి వచ్చాడు. 1986లో పీపుల్స్ వార్ ఆగ్రహానికి గురై దుర్మరణం చెందాడు. ఆ హత్యకేసులోను పరిటాల రవిని నిందితుడ్ని చేయడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రహస్య జీవితం గడిపాడు అప్పుడే నక్సలైటు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కొండపల్లి సీతారామయ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

కేసుల తర్వాత నుంచి బయిటపడి తిరిగి వెంకటాపురం చేరి, తన తండ్రి, తమ్ముడు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఏదో ఒక రూపంలో ముందుకు తీసుకువెళ్లడానికి ఉపక్రమించారు. ఫ్యాక్షనిజాన్ని నిర్ములించటమే తన జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకుని,అందుకు అవసరమైన సాధన సంపత్తులను సమకూర్చుకునే మార్గాల మీద దృష్టిని కేంద్రీకరించారు. ఆనతికలలోనే పరిటాల రవికి దనదైన ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పడింది. రాష్ట్రంలో 1985లో జరిగిన మండల వ్యవస్థ తొలి ఎన్నికల్లో పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్షపదవికి రంగంలోకి దిగిన దళితుడు ఓబన్న అత్యాధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు.

అదే సమయంలో పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి బుటాకపు ఎన్ కౌంటర్ ల వెనక కీలకమైన వ్యక్తి సానె చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలోకి దిగాడు. భారీ పొలిసు బందోబస్తుతో ఎన్నకల ప్రచారానికి వస్తున్నా చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆత్మాహుతి దళంతో అడ్డుకున్న పరిటాల రవీంద్ర సాహసం … ప్రాంతంలోని బడుగు వర్గాల ప్రజలకు బలాన్నిచ్చింది. 1991 నుంచి స్వైర విహారం చేస్తున్న ఆరాచక శక్తుల్ని ఎదుర్కొంటూ పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యారు.

తన అనుచరుల్ని నక్సలైట్లుగా చిత్రీకరించి హతమార్చిన కుట్ర జరుగుతోందని గ్రహించిన పరిటాల రవి 1992లో పోలీసులకు లొంగిపోయారు. 1993లో పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో యావత్తు రాయలసీమ ఆయనకు బ్రహ్మరథం పట్టింది. మద్దెలచెరువు టీవీ బాంబు కేసులో జైలులో ఉన్న రవి జైలు నుంచే టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేసి పెనుగొండ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఇక ఆ తర్వాత అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీ రోల్ పోషించారు. అప్పట్లో పరిటాల రవి కక్షసాధింపు చర్యలకు దిగుతారని శత్రువులు భయపడ్డారు.

అయితే ఆయన అనేక గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చారు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు. చంద్రబాబు హయాంలో ఆయనకు పార్టీలో సముచిత స్థానం దక్కింది. 1997లో పరిటాల రవి తన తండ్రి జీవిత కథ ఆధారంగా ‘శ్రీరాములయ్య’ ఆడవారిని నిర్మించడానికి సంకల్పించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో జరిగిన కారు బాంబు దాడిలో తీవ్రంగా గాయపడినా, ప్రాణాలతో బయటపడ్డారు. నసనకటలో తాను పునరుద్దరించిన ఆలయ ప్రాంగణంలో రెండున్నర లక్షల మంది ప్రజల సమక్షంలో పరిటాల రవి 550 జంటలకు సామూహిక వివాహాలు చేశారు. 2004 ఫిబ్రవరిలో మరో 1,116 జంటలకు పెళ్లిళ్లు జరిపించి పేదలపక్షపాతిగా నిలిచిపోయారు.

2004లో టీడీపీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరుల ఏరివేత ప్రారంభమైంది. రవిపై ఉన్న పాత కేసులు తిరగదోడింది. కాంగ్రెస్ ప్రభుత్వం రవికి అప్పటి వరకు రక్షణగా ఉండే గన్ మెన్ సంఖ్యను రెండుకు తగ్గించింది . ఇక తన ప్రాణాలకు వాటిల్లే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న రవి మానసికంగా అన్నింటికీ సిద్ధం అయ్యారు. అతను జరుగుతున్న కుట్రలను గురించిన వివరాలను బహిర్గతం చేస్తూ వచ్చారు.

చెర్లపల్లి జైల్లో ఉన్నకారు బాంబు నిందితుడు మద్దల చేరాడు సూరితో అప్పటి సీఎం వైఎస్‌ కుమారుడు జగన్‌ తనను హత్య చేసేందుకు సెల్‌ఫోన్‌లో సంభాషణలు కొగిస్తున్నట్టు సమాచారం. దాంతో పరిటాల మీద జగన్ పరువు నష్టం దావా వేశాడు. 2005 జనవరి 24న అనంతపురం టీడీపీ ఆఫీసులో అనేక మంది అతిరథ మహారథులు, పార్టీ శ్రేణులు, నాయకులు, సాయుధులైన అంగరక్షకులు పరిటాల రవిపై ప్రత్యర్థులు గుళ్ల వర్షం కురిపించి హతమార్చారు.

దివంగత జననేత పరిటాల రవికి స్వగ్రామం రామగిరి మండలం వెంకటాపురంలో ప్రతి ఏట వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రాణం ఇచ్చే అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్న పరిటాల రవి అస్తమించని సూర్యుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పటికీ ఆ’పెనుగొండ పులి’ప్రజల హృదయాల్లో జీవిస్తునే ఉన్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird