జనవరి 24, 2026 10:19AMన పోస్ట్ చేయబడింది

నిజామాబాద్‌లో శివారులో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేసి ఎక్సైజ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో తనఖీలు జరుపుతున్న ఎక్సైజ్ అధికారులు, సిబ్బందిపై గంజాయి బ్యాచ్ కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనల్లో తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్ గాజుల సౌమ్యాను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనానంతరం పోలీసులు వాహనాన్ని వెంబడించి ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. 2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
