పోస్ట్ చేయబడింది జనవరి 23, 2026 2:12PM

మాటలతో కాకుండా పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని నమ్మిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అంటూ దేశాన్ని కదిలించారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’తో బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పాటు చేశారు. 1945 ఆగస్టు 18న బోస్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. కానీ ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది.
దేశ స్వాతంత్య్రం కోసి తన జీవితాన్నే త్యాగం చేసిన ఆ మహానాయకుడి జయంతి జనవరి 23. ఆయన జయంతి రోజులను పరాక్రమ్ దివస్ అని పిలుస్తారు. నేతాజీ బ్రిటీషర్ల గుండెల్లో రైళ్ల పరిగెత్తించిన ధీరుడు. శాంతి వల్ల స్వాతంత్ర్యం రాదని.. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తానని దేశ ప్రజల రణరంగం పైపు నడిపిన అసలు సిసలు యోధుడు.
స్వాంతత్య్రం కేవలం మాలతో రాదని నమ్మిన నాయకుడు సుభాష్‌చంద్రబోస్. బ్రిటీష్ పాలనను ఎదిరించాలంటే ఆయుధాలతోనే పోరాటం చేయాలన్న సంకల్పం ఆయనది. అదే ఆయన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ నాయకుడిగా నిలబెట్టింది. నాలుగేండ్లలో జరిగిన అత్యంత కఠినమైన ఐసీఎస్‌లో మంచి ర్యాంకు పరీక్ష సాధించారు, బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతుగా పనిలేదని ఆ ఉద్యోగాన్ని వదిలేసిన త్యాగశీలి ఆయన. స్వామి వివేకానందుని ప్రభావం నేతాజీపై ఎక్కువగా కనిపిస్తుంది.
ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తి కలిసి నడవాలని నమ్మేవారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన నేతాజీ, స్వాతంత్ర్యం సాధించే విషయంలో ఇతర నాయకులతో విభేదించి కాంగ్రెస్‌ను వీడారు. విదేశాల్లో భారత్ స్వాతంత్ర్యమే ఆయన లక్ష్యంగా కొనసాగుతోంది. జర్మనీ నుంచి ఆజాద్ హింద్ రేడియో ప్రారంభించి భారతీయుల్లో ధైర్యం నింపారు.
ఈ నేపధ్యంలో జైహింత్ అనే నినాదాన్ని నేతాజీ దేశానికి అందించారు. 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి ఆయన చేసిన పోరాటం బ్రిటీష్ పాలనకు పెద్ద సవాల్‌గా నిలిచింది. జపాన్ సాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని ముందుకు నడిపిస్తూ, స్వాతంత్య్రాన్ని కొత్త దశకు తీసుకెళ్లారు.
[1945విమానప్రమాదంలోఆయనమరణించారనివార్తవచ్చినాఇప్పటికీచాలామందిఆయనబతికేఉన్నారనినమ్ముతారుమొత్తానికిసుభాష్‌చంద్రబోస్జీవితంధైర్యానికిత్యాగానికిదేశభక్తికిప్రతీకఆయనఆలోచనలుపోరాటంఈరోజుయువతకీనిప్రేరేపిస్తుందిఒక్కముక్కలోచెప్పాలంటేనాయకుడుఅంటేఆయనేరియల్లైఫ్‌లోఅసలుసిసలు’భారతీయుడు’మననేతాజీ
