Home Latest News తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ | అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్| భారతీయ రైల్వేలు| PM MODI| తెలంగాణ| చెర్లపల్లి|ముజఫర్‌పూర్ – Andhra Waves

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ | అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్| భారతీయ రైల్వేలు| PM MODI| తెలంగాణ| చెర్లపల్లి|ముజఫర్‌పూర్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ | అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్| భారతీయ రైల్వేలు| PM MODI| తెలంగాణ| చెర్లపల్లి|ముజఫర్‌పూర్


పోస్ట్ చేయబడింది జనవరి 23, 2026 3:07PM


తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ అమృత్ భారత్ రైలు నడవబోతోంది. జనవరి 23, 2026న కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తిరువనంతపురం- చర్లపల్లి మధ్య ఈ అమృత భారత్ రైలు నడవనుంది.

ఇప్పటికే చర్లపల్లి-ముజఫర్ పూర్ (బీహార్) మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. తిరువనంతపురం- చర్లపల్లి మధ్య నడిచే ఈ రైలు తెలంగాణకు కేటాయించిన రెండో అమృత్ భారత్ రైలు. ఈ రైలు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి ఉదయం 7.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, తర్వాతి రోజు రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో, స్వదేశీ సాంకేతికతతో డిజైన్ చేశారు. వివిధ సౌకర్యాలను ఈ రైళ్లు అందజేసే ధరల్లోనే ప్రయాణికులకు సేవలు అందించబోతున్నాయి.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird