జనవరి 23, 2026 6:04PMన పోస్ట్ చేయబడింది

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేశారా? ఎవరు చేయించారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు.? అనే వివరాలు అడిగినట్లు. కాగా మాజీ మంత్రి హరీశ్ రావు కూడా సిట్ ఇలాగే 7 గంటలు విచారించింది. ఉదయం 11 గంటల సమయంలో కేటీఆర్ విచారణ మొదలైంది. ఈ సందర్భంగా అధికారులు మాజీ మంత్రి నుంచి కీలక స్టేట్మెంట్ను నమోదు చేసినట్లు సమాచారం.
విచారణలో భాగంగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా కేటీఆర్‌తో కలిసి గంటపాటు సిట్ ప్రశ్నించారు. గతంలో కేటీఆర్, రాధాకిషన్ రావుకు షేర్ చేసిన కొన్ని మొబైల్ నంబర్లపై ప్రత్యేకంగా విచా రణ జరిపినట్లు సమా చారం. ఆ నంబర్లకు సంబం ధించిన కాల్ డేటా, ఫోన్ ట్యాపింగ్ సంబంధిత లోతైన ప్రశ్నలు వేసినట్లు తెలుస్తున్నది. గతంలో ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు, కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి సిట్ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఆ సమయం లో ఎవరితో ట్యాపింగ్ జరిగిందన్న అంశంపై కేటీఆర్ వివరణ కోరినట్లు అధికారులు గుర్తించారు.
అయితే ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన వారు వినియోగించుకున్న అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.ఈ కేసులో ఇప్పటికే అధికారులు, సిబ్బందిని సిట్ అధికారులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ విచారణతో ఈ వ్యవహారం మరింత దశకు చేరిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విచారణ సమయంలో కేటీఆర్ సిట్ అధికారులకు సహకరించినట్లు తెలిసింది.విచారణ ముగిసిన అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు బయలుదేరారు.
.webp)