
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా వారిద్దరు సిట్ అధికారులను బెదిరించి.. భయబ్రాంతులకు గురిచేశారు. విచారణలో అధికారులకు సమాధానం చెప్పేలా కాకుండా… విచారణ చేస్తే మాట్లాడతారని చెప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దర్యాప్తు సంస్థలను బెదిరించడం నేరమని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని నియమించారు.