జనవరి 22, 2026 11:47AMన పోస్ట్ చేయబడింది

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఉద్యాన, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దే విషయంలో ఆయన యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి థాన్ అహ్మద్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి యూఏఈకి ఉత్పత్తుల ఎగుమతితో పాటు, రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో దుబాయ్ ఫుడ్ క్లాస్టర్ ఏర్పాటుపై కూడా చంద్రబాబు, థాని బిన్ అహ్మద్ గురించి చర్చించారు. యూఏఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనువైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని వివరించిన చంద్రబాబు, ఉత్పత్తుల వేగ రవాణాకు వీలుగా పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్డు, రైలు మార్గాల నెట్‌వర్క్ విస్తృతంగా ఉందని తెలిపారు. అంతే కాకుండా జాతీయ పారిశ్రామిక కారిడార్లు కూడా రాష్ట్రానికి అనుసంధానమై ఉన్నాయని వివరించారు.
అదే విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు గల అవకాశాలను వివరించిన సీఎం చంద్రబాబు, డీపీ వరల్డ్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్‌వరల్డ్, ఏడీ పోర్ట్స్ వంటి ప్రముఖ యూఏఈ కంపెనీలు ఏపీలో పారిశ్రామిక పార్కులను నెలకొల్పాలని నిర్ణయించాయి. అలాగే పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం 160 గిగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో టాక్వా, మజ్దార్ వంటి కంపెనీలు, ఏడీఐఏ, ముబాద్లా వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న స్పేస్, డ్రోన్ సిటీల అభివృద్ధిలోనూ యూఏఈ భాగస్వా కావాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదనలపై యూఏఈ మంత్రి థాని బిన్ అహ్మద్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
.webp)