Home Latest News ఏపీలో పండుగ వాతావరణం కంటిన్యూస్.. | ఏపీలో పండుగ వాతావరణం కొనసాగుతుంది| అభివృద్ధి| సంక్షేమం| వినోదం| సమాన| ప్రాముఖ్యత| టెడ్| kutami – Andhra Waves

ఏపీలో పండుగ వాతావరణం కంటిన్యూస్.. | ఏపీలో పండుగ వాతావరణం కొనసాగుతుంది| అభివృద్ధి| సంక్షేమం| వినోదం| సమాన| ప్రాముఖ్యత| టెడ్| kutami – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఏపీలో పండుగ వాతావరణం కంటిన్యూస్.. | ఏపీలో పండుగ వాతావరణం కొనసాగుతుంది| అభివృద్ధి| సంక్షేమం| వినోదం| సమాన| ప్రాముఖ్యత| టెడ్| kutami


జనవరి 22, 2026 1:47PMన పోస్ట్ చేయబడింది


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి సీజన్ ఇంకా ముగియలేదు. సంక్రాంతి వెళ్లిపోయినా.. రంగవల్లుల మాసం ఇప్పుడే మొదలైందా అన్నట్లుగా పంగుగ వాతావరణం కొనసాగుతోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పండుగలు, పబ్బాల సందర్భంగా సందడి, సంతోషం కనిపించని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిరోజూ పండుగే అన్నట్లుగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం తెలుగుదేశం కూటమి సర్కార్ ఏకకాలంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు వినొద వేడుకలకు కూడా సమ ప్రాధాన్యత ఇస్తుండటమే.

జగన్ హయాంలో పాలన అంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు అంటూ బటన్ నొక్కడం మాత్రమే అన్నట్లుగా సాగింది. అలాగే అధికారం ఉన్నది ప్రత్యర్థులను, తమను వ్యతిరేకించేవారు, తాము ఇష్టపడిన వారిపై దాడులు, దౌర్జన్యాలూ, కేసులూ అన్నట్లుగా సాగిన పరిస్థితి నుంచి ఇప్పుడు తెలుగుదేశం సర్కార్ హయాంలో గత 18 నెలలుగా ప్రజాలకు ఇటు సంక్షేమం పేరిట సూపర్ సిక్స్ హామీలు అమలవుతున్నాయి, అలాగే అమరావతి, పెలవరం ప్రాజెక్టులతో పాటు పలు అభవృద్ధి కార్యక్రమాలు,, ఉద్యోగ అవకాశాలను కల్పించడం లేదు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, పల్లెల వారిగా ఎంటర్ టైన్ మెంట్ ను ఎంకరేజ్ చేస్తోంది. ఇందులో భాగంగానే గ‌త ఏడాది విజ‌య‌వాడ ఉత్స‌వ్‌ పేరుతో మైసూర్‌కు దీటుగా దసరా వేడుకలను నిర్వహించారు. ఆ తర్వాత.. తిరుపతిలో.. ఇలా ఏదో ఒక రూపంలో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ వేడుకలు సాగేలా కార్యాచరణ రూపొందించబడింది. ఈ వేడుకలలో ప్రజల మమేకం చేయడం ద్వారా రాష్ట్రమంతటా ఒక ఫెస్ట్ వాతావరణం నెలకొంటుంది.

తాజాగా ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, కనువిందు చేసే ప్రకృతి అందాలను ప్రపంచానికి చాటేలా విశాఖ ఉత్సవ్ కు శ్రీకారం చుట్టింది. శనివారం (జనవరి 24) నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు విశాఖ ఉత్సవాన్ని నిర్వహించనుంది. శిఖరం నుంచి సాగరం వరకూ అనే థీమ్ తో విశాఖ, అనకాపల్లి, అరకు ప్రాంతాల్లో ఈ ఉత్సవం జరగనుంది. కొద్ది రోజుల ముందే కోససీమ జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జగ్గన తోట తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా ఏడాది పొడవునా జనంలో పండుగ సంతోషాన్ని నింపే విధంగా కార్యక్రమాలను రూపొందించి తెలుగుదేశం కూటమి.. అభివృద్ధి, సంక్షేమం, వేదికలకు సమప్రాధాన్యత ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird