జనవరి 22, 2026 5:03PMన పోస్ట్ చేయబడింది

ఆర్మీ వాహనం లోయలో పడి పది మంది జవాన్లు దుర్మరణం పాలైన ఘటన జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని దోడా సెక్టార్‌లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 10 మంది జవాన్లు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సైన్యం సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను హుటాహుటిన ఉధంపూర్ మిలటరీ ఆసుపత్రికి. గాయపడిన వారిలో పలువురి జవాన్ల పరిస్థితి విషమంగా కనిపిస్తోంది. ఘటన జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 17 మంది సైనికులు ఉన్నారు. భదేర్వ-చంబా అంతర్రాష్ట్ర రహదారి వెంబడి ఖన్నీ టాప్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం 200 అడుగల లోయలో పడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
.webp)