జనవరి 22, 2026 8:51AMన పోస్ట్ చేయబడింది

భారత గణతంత్ర వేడుకలు టార్గెట్ గా దేశంలో ఉగ్రదాదులు జరిగే అవకాశాలున్నాయన్న సమాచారంతో నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలుఅలర్ట్ అయ్యాయి. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ ఉగ్రదాడికి సహకరించనున్నట్టు నిఘా వర్గాలు ఉన్నాయి. జనవరి 26న దేశంలోని పలు ప్రాంతాల్లో జరిపే ఈ దాడులకు 26-26 కోడ్ నేమ్ పెట్టినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దేశంలోని పలు ఆలయాలు, నగరాలతో పాటు అయోధ్యలోని రామాలయం, జమ్మూలోని రఘునాథ్ ఆలయం ఉగ్రవాదుల టార్గెట్‌లో ఉన్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి.
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్, పంజాబ్ గ్యాంగ్‌స్టర్‌లతో ఐఎస్‌ఐ ఈ ఉగ్రదాడికి ప్రణాళిక రచిస్తున్నదని పేర్కొన్నారు. గత నవంబర్‌లో ఎర్రకోట వెలుపల జరిగిన కారుబాంబు పేలుడు ఘటన వెనుక జైషే మహ్మద్ ఉంది. తాజా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి నిఘా విభాగాల భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానితుల పోస్టర్లను ఢిల్లీలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో వీటిని ఉంచారు. గత ఏడాది ఏప్రిల్‌లో లష్కరే తొయిబా ఉగ్రసంస్థ పహల్గాంలో జరిపిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
కాగా గత వారం లష్కరే సంస్థ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదానికి కట్టుబడి ఉన్నామని బహిరంగంగా ప్రకటించారు. హిందువులకు వ్యతిరేకంగా లష్కరే కమాండర్ విద్వేషపూరిత ప్రసంగం చేశాడు. హిందువుల కుత్తుకలు కోసినప్పుడే స్వేచ్ఛ’ సాధ్యమని పీఓకేలో జరిగిన ఒక కార్యక్రమంలో అబూ మూసా కశ్మీరీ చేసిన ప్రసంగం తాలూకా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా కశ్మీరీ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.
