Home Latest News ఏపీలో ఆర్ఎంజడ్ పెట్టుబడులు లక్ష కోట్లు! | rmz ఒకరికి పెట్టుబడి పెట్టాలంటే ap లో కోట్లు లేవు| mou| దావూస్| మంత్రి| లోకేష్| సీఈఓ| మనోజ్ – Andhra Waves

ఏపీలో ఆర్ఎంజడ్ పెట్టుబడులు లక్ష కోట్లు! | rmz ఒకరికి పెట్టుబడి పెట్టాలంటే ap లో కోట్లు లేవు| mou| దావూస్| మంత్రి| లోకేష్| సీఈఓ| మనోజ్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఏపీలో ఆర్ఎంజడ్ పెట్టుబడులు లక్ష కోట్లు! | rmz ఒకరికి పెట్టుబడి పెట్టాలంటే ap లో కోట్లు లేవు| mou| దావూస్| మంత్రి| లోకేష్| సీఈఓ| మనోజ్


జనవరి 21, 2026 9:39AMన పోస్ట్ చేయబడింది


ఏపీలో లక్ష కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆర్ఎంజడ్ సంస్థ ముందుకు వచ్చింది. దావోస్ వేదికగా ఆర్ఎంజాడ్ చైర్మన్ మనోజ్ మెండాతో ఏపీ మంత్రి నారాలోకేష్ మంగళవారం (జనవరి 20) జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్ఎంజెడ్ అంగీకరించింది.

ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖపట్నంలో జీసీసీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విశాఖపట్నం ఫేజ్-1 ఐటీ పార్క్‌లో సుమారు 50 ఎకరాలలో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జీఈసీ పార్క్ పార్క్ అభివృద్ధికి ఆర్ఎంజాడ్ ఒప్పందం కుదిరింది.

మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆర్ఎంజాడ్ ఛైర్మన్ మనోజ్ మెండా ఈ వ్యూహాత్మక పెట్టుబడిని ప్రకటించారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికంగా, లాజిస్టిక్స్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూనే, విశాఖపట్నాన్ని నెక్ట్స్ జెన్ మిక్స్డ్ యూజ్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దర్శనికతకు అనుగుణంగా ఆర్ఎంజడ్ ఈ పెట్టుబడులు పెట్టింది. దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాలలో సుమారు లక్ష మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird