Home Latest News అమెరికా ఆధిపత్యానికి దావోస్ వేదికగా గండి?.. ప్రపంచ దేశాల ఐక్యతారాగం? | అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు దావోస్ వేదిక| సింఫొనీ – Andhra Waves

అమెరికా ఆధిపత్యానికి దావోస్ వేదికగా గండి?.. ప్రపంచ దేశాల ఐక్యతారాగం? | అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు దావోస్ వేదిక| సింఫొనీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
అమెరికా ఆధిపత్యానికి దావోస్ వేదికగా గండి?.. ప్రపంచ దేశాల ఐక్యతారాగం? | అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు దావోస్ వేదిక| సింఫొనీ


జనవరి 21, 2026 11:13AMన పోస్ట్ చేయబడింది


దావోస్ లో ఏటా జరిగే ఆర్థిక వేదిక సదస్సు ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నడూ లేనంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం ఆర్థిక వ్యవహారాల పరంగానే కాకుండా ప్రపంచ రాజకీయ సమీకరణలకు కూడా ఈ సారి సదస్సు వేదికగా మారింది. దాదాపు 130 దేశాల వాణిజ్య, వ్యాపార రంగాల ప్రతినిథులు ప్రముఖులతో పాటు, 400 మంది అగ్రశ్రేణి రాజకీయ నాయకులు కూడా నాయకులు, వీరిలో 65 మంది దేశాధినేతలు కావడం విశేషమే కాకుండా ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రాముఖ్యత ఏర్పడింది.

అన్నిటికీ మించి దాదాపు ఆరు సంవత్సరాల తరువాత ఈ సదస్సుకు అగ్రరాజ్యాధినేత హోదాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు. మొత్తంగా ట్రంప్ దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు కావడం ఇది మూడో సారి. ఈ సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, ఆయన టారిఫ్ వార్, సామ్రాజ్యవాద ఆక్రమణ, ఆధిపత్య ధోరణిపై ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమౌతున్న ఈ సదస్సులోనూ ప్రతిఫలించే అవకాశాలున్నాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. మొత్తంగా గ్రీన్ ల్యాండ్ ను ఎలాగైనా ఆక్రమించి తీరుతాం అన్న ట్రంప్ ప్రకటన నేపథ్యంలో దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ట్రేడ్ వార్ కు దారి తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ట్రంప్ కు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన నేపథ్యంలో ఈ సారి ఈ సదస్సు ఔట్ కమ్ ఏకధృవ ప్రపంచం అన్న భావాన్నీ లేకుండా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అంటే ట్రంప్ దావోస్ కు చేరుకోవడానికి ముందే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా కెనాడ ప్రధాని మార్క్ కార్నీ అమెరికా ఆధిపత్యానికి ఇక చెల్లు చీటీ పాడాలని పిలుపునిచ్చారు. మరో వైపు ట్రంప్ ఆక్రమణలను, టాక్స్ టెర్రర్ ను ఎదుర్కొనేందుకు యూరోపియన్ కమీషన్ అధ్యక్షురాలు ఉర్పులా వాన్ డేర్ లేయన్, అలాగే చైనా వైస్ ప్రీమియర్ హీ లైఫెంగ్ ల మధ్య కీలక చర్చ జరిగినట్లు సమాచారం.
ఇక దావోస్ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ ట్రంప్‌తో ఆయన నేరుగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిరువురి మధ్యా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆయుధాలు, వ్యూహాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆర్థికపరమైన, అంటే పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమలకు ఆహ్వానం వంటి చర్చలు రెండో స్థానానికి పరిమితమై అమెరికా అంతర్జాతీయ ఆర్థిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావడంపై చర్చలకే అగ్రస్థానం దక్కే అవకాశం ఉంది. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అమెరికా ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు వినిపించేందుకు వేదికగా మారే అవకాశాలున్నాయని ప్రపంచ ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird