జనవరి 21, 2026 10:31AMన పోస్ట్ చేయబడింది

అత్యంత శక్తిమంతమైన కోటరీ ఉండి కూడా ప్రజలు ఎన్నుకున్న బలమైన ప్రభుత్వాధినేత అయిన వెనిజువెల అధ్యక్షుడు మదురో ని అమెరికా సేనలు, ఆయన సతీమణితో సహా ఆయన నివాసంలోనే బంధించి తీస్కెళ్తుంటే.. ప్రజా జీవితంలో ఇలాంటి వారు ఉండలేరు. దుస్థితిని ఎదుర్కుంటారు అంటే అర్ధం వచ్చేలా మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అన్నిటికీ మించి మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు విజయసాయి హాజరు కావడానికి కొన్ని రోజుల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ఎందుకంటే విజయసాయి కామెంట్స్‌లోని రెండు అంశాలు ఇక్కడ నేటివిటీని కనెక్ట్ చేశాయి. అందులో మొదటిది జగన్ కాగా.. రెండోది ఆయన చుట్టూ ఉన్న కోటరీ. ఇక్కడ ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. విజయసాయి జగన్ కు అత్యంత సన్నిహితులలో ఒకరు. సరే అది గతం అంటారా, ఓకే. కానీ జగన్ సంపదను మదుపు చేయడం మాత్రమే కాక.. ఇప్పటికీ ఎలాంటి ఇబ్బంది రావడం లేదంటే.. దాని వెనుక ఉన్న శక్తి, యుక్తి విజయసాయిదే. జగన్ పార్టీ నుంచి అన్ని పదవుల నుంచి విజయసాయి బయటకు వచ్చారు. కాబట్టి ఆయనకు జగన్ తో ఎలాంటి సత్సంబంధాలు లేవని అంతా భావిస్తున్నారు. కానీ, ఇప్పటికీ జగ’న్ ఆస్తిపాస్తుల వివరాలు, లెక్క పత్రాలు, జమాఖర్చులను చూస్తోంది సాయిరెడ్డి టీమే. సాయిరెడ్డి కేవలం రాజకీయంగా మాత్రమే జగన్‌కు దూరమయ్యారు తప్ప, జగ’న్‌తో వ్యక్తిగత, ఆర్థిక సంబంధాలు ఇసుమంతైనా దెబ్బతినలేదని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రాజకీయం వేరు.. విజయసాయి రెడ్డి వృత్తి అదే చార్టెడ్ అక్కౌంటెంట్ వేరు.
విజయసాయిరెడ్డి చెబుతున్న కోటరీ విషయానికి వస్తే… ఆయన గతంలో పార్టీకి ఎంత కీలకంగా పని చేశారో చూడాలి. సొమ్మొక్కరిదీ, సోకొకరిదీ అన్న’ట్టు 2019లో వైసీపీ విజయం వెనుక విజయ’సాయిరెడ్డి పాత్రే కీలకం. చంద్రబాబు గురించి అలెర్ట్ చేస్తూ స్వయంగా తన వాయిస్ రికార్డ్ చేస్తూ దాన్ని కూడా వైరల్ చేసి.. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యం సాధించారు గలిగారు. అయితే ఇవేవీ గుర్తించని జగన్ విజయ సాయి అప్పటికీ- ఇప్పటికీ- ఎప్పటికీ తన ఛార్టెడ్ అక్కౌంటే.. అన్నట్లుగా లైట్ తీసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విజయసాయిని కేవలం గుమస్తా అన్నట్లుగా జగన్ ట్రీట్ చేశారు. ఈ తరువాత సకలశాఖల మంత్రి సజ్జల ఎంట్రీతో.. విజయసాయిని పూర్తిగా పక్కన పెట్టేశారు. సరే తరువాత 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అయితే ఆ పరాజయం తరువాత కూడా జగన్ విజయసాయిని రాజకీయంగా దగ్గరకు తీయలేదు. ఈ నేపథ్యంలోనే విజయసాయి వైసీపీకి దూరమయ్యారు. వ్యవసాయమే తన వ్యాపకం అంటూ రాజకీయ సన్యాసం ప్రకటించారు.
అంతే కానీ ఎక్కడా జగన్ పై విమర్శలు చేయలేదు. కానీ జగన్ కోటరీ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సూచనలు, హెచ్చరికలు మాత్రం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన వెనిజువేలా అధ్యక్షుడి ఉదంతాన్ని ఉటంకిస్తూ.. ఈ అమ్మడు పోయిన కోటరీ పట్ల జాగ్రత్తగా ఉండమని జగన్ శ్రేయస్సు కోరితే హెచ్చరించారంటే.. విజయసాయి స్వామి భక్తి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. కోటరీ ఎంత బలమైనదో ఇప్పుడు విజయసాయి చెప్పారు కానీ, గతంలో నే మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా చెప్పారు. ఆ కోటరీ జగన్ చెవులు మూసేసిందని అంటున్నారు. అందుకే కోటరీ చట్రంలో బందీ అయిన జగన అప్రమత్తం చేయడానికి విజయసాయి వెనుజువెల అధ్యక్షుడితో పోల్చి చెప్పారు.
ఇక జగన్ విషయానికి వస్తే.. రప్పా రప్పా అంటూ వీధుల్లో చేరి బ్యానర్లు కట్టి, జంతు బలులు ఇచ్చి మరీ పేట్రేగి పోవడంతో జనం జడుసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. గత ఎన్నికల్లో వచ్చిన పదకొండు స్థానాలూ, 2029 ఎన్నికల్లో ఒక్కటి కూడా పడిపోయే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. అది గుర్తించే విజయసాయి జగన్‌కి హితోపదేశ వేణుగానం వినిపించే యత్నం చేస్తున్నారట.
.webp)