Home Latest News అమానుషం.. అన్నం ప్లేటులో చేతులు కడిగినందుకే యువకుడి హత్య | హత్యకు దారి తీసిన చిన్న వివాదం| సంగారెడ్డి| జిల్లా| కొల్లూరు – Andhra Waves

అమానుషం.. అన్నం ప్లేటులో చేతులు కడిగినందుకే యువకుడి హత్య | హత్యకు దారి తీసిన చిన్న వివాదం| సంగారెడ్డి| జిల్లా| కొల్లూరు – Andhra Waves

by andhra andhrawave
0 comments
అమానుషం.. అన్నం ప్లేటులో చేతులు కడిగినందుకే యువకుడి హత్య | హత్యకు దారి తీసిన చిన్న వివాదం| సంగారెడ్డి| జిల్లా| కొల్లూరు


జనవరి 21, 2026 9:27AMన పోస్ట్ చేయబడింది


ప్లేట్‌లో చేతులు కడిగిన విషయంపై ఘర్షణ ఏకంగా యువకుడి హత్యకు దారి తీసిన అమానుష సంఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఉస్మాన్‌ నగర్‌లోని హోమ్ ట్రీ అపార్ట్‌ మెంట్స్‌లో అధునాతన కార్పెంటర్ శ్యామ్ పంచాలు (28) అన్నం ప్లేటులో చేతులు కడిగిన విషయం వాగ్వాదంలో హత్యకు దారితీసింది.

పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాలున్ జిల్లా గోరాంగ్ గ్రామానికి చెందిన పంచాలు వృత్తిరీత్యా కార్పెంటర్.గత మూడు రోజులుగా ఉస్మాన్‌నగర్‌లోని హోమ్ ట్రీ అపార్ట్‌ మెంట్స్‌లో మిథ్లేష్ కుమార్, అతుల్ సహానీ అనే ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఉన్నారు.

సోమవారం (జనవరి 19) ఉదయం ముగ్గురు కలిసి భోజనం చేస్తుండగా, శ్యామ్ పంచాలు అతుల్ సహానీ ప్లేటులో చేతులు కడిగిన విషయం వివాదానికి దారితీసింది. వివాదం ముదిరి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహానికి గురైన అతుల్ సహానీ గుర్తు తెలియని వస్తువుతో శ్యామ్ పంచాలపై దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్యామ్ పంచాల అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు అతుల్ సహానిని అదుపులోకి తీసుకున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird