Home Latest News డబ్ల్యుపీఎల్.. ఆర్సీబీ రికార్డు | wpl|లో rcb రికార్డ్ వరుసగా| ఆరు| విజయాలు| 1వ – Andhra Waves

డబ్ల్యుపీఎల్.. ఆర్సీబీ రికార్డు | wpl|లో rcb రికార్డ్ వరుసగా| ఆరు| విజయాలు| 1వ – Andhra Waves

by andhra andhrawave
0 comments
డబ్ల్యుపీఎల్.. ఆర్సీబీ రికార్డు | wpl|లో rcb రికార్డ్ వరుసగా| ఆరు| విజయాలు| 1వ


పోస్ట్ చేయబడింది జనవరి 20, 2026 12:01PM


మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం గుజరాత్ జెయింట్స్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. ప్లేస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వడోదరలోని బీసీఏ స్టేడియం కోటాంబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టోర్నీనవీ ముంబై నుంచి వడోదరకు మారిన తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరులోనే టీమ్ సత్తా చాటింది.

గత సీజన్‌లో ఆఖరి మ్యాచ్ గెలవడంతో పాటు.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి 10 పాయింట్లు సాధించిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గతంలో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు రెండు సార్లు వరుసగా ఐదు విజయాలు సాధించగా.. ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ ఆర్సీబీ అగ్రస్థానానికి చేరుకుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird