Home Latest News 270 ఏళ్ల తర్వాత కేరళ కుంభమేళా | 270 ఏళ్ల తర్వాత కేరళ కుంభమేళా| keralartc| 100| ప్రత్యేక – Andhra Waves

270 ఏళ్ల తర్వాత కేరళ కుంభమేళా | 270 ఏళ్ల తర్వాత కేరళ కుంభమేళా| keralartc| 100| ప్రత్యేక – Andhra Waves

by andhra andhrawave
0 comments
270 ఏళ్ల తర్వాత కేరళ కుంభమేళా | 270 ఏళ్ల తర్వాత కేరళ కుంభమేళా| keralartc| 100| ప్రత్యేక


పోస్ట్ చేయబడింది జనవరి 20, 2026 12:12PM


కేరళలో సుమారు 270 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ‘కేరళ కుంభమేళా’ ..మహామాఘ మహోత్సవం.. ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఈ ఉత్సవానికి వేలాదిగా తరలివస్తున్న భక్తులు. కేరళలోని నీలా నది తీరంలో కేరళ కుంభమేళాగా చెప్పుకునే మహామాఘ మహోత్సవం మలప్పురం జిల్లా తిరునవయలో. ఈ కుంభమేళాను కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.. ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించారు. మహామాఘ మహోత్సవం లో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్‌లో మహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి మహారాజ్ సందర్భంగా జరిగింది. 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఉత్సవాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడం విశేషం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం కేరళ కుంభ మేళ 1755 లో జరిగినట్లు సమాచారం.

ఫిబ్రవరి 3 వరకు కేరళ కుంభమేళా కొనసాగుతుంది. ఈ ఉత్సవానికి కేరళ, తమిళనాడు సహా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 50 వేల మందికి పైగా భక్తులు నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు విచ్చేస్తుంటారు. ప్రతిరోజూ కాశీ పండితుల ఆధ్వర్యంలో సాయంత్రం నీలా హారతి నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం కేరళ ఆర్టీసీ 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అంతేకాదు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యోగా, కలరిపయట్టుతోపాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird