పోస్ట్ చేయబడింది జనవరి 19, 2026 2:37PM

దేశాన్ని కుదిపేసిన సత్యం కంప్యూటర్ స్కామ్ ఇప్పుడు జన్వాడ భూముల వ్యవహారంలో మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ శివారులోని జన్వాడలో దాదాపు 5 వేల కోట్ల రూపాయల విలువైన భూముల అక్రమ బదలాయింపు పై ఈడీ కోర్టు విచారణ కీలక మలుపు తిరిగింది. జన్వాడ లాండ్స్ లావాదేవీలపై తాను సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ అభినవ్ అనే వ్యక్తి ఈడీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ స్కామ్‌లో వాస్తవంగా ఏం జరిగిందో కోర్టు ముందు వెల్లడించేం దుకు తనకు అవకాశం అందించిన అభినవ్ తన పిటిషన్లో ఉంది.
జన్వాడ భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబం ధించి అప్పట్లో జరిగిన అక్రమ లావాదేవీలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ఈడీ విచారణకు తన వాంగ్మూలం కీలకంగా మారుతుందని అభినవ్ తెలిపారు. ఈడీ ప్రత్యేక కోర్టు, ఈ పిటిషన్లను విచారించి… నిర్ణయం స్పందించాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే జన్వాడ ల్యాండ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులతో పాటు మొత్తం 213 మందికి ఈడీ ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ భూముల వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై ఈడీ దాఖలు చేసిన అభియోగాలపై తమ వాదన వినిపించాలని కోర్టులో ఈడీ దాఖలు చేసింది. నుండి జన్వాడ భూముల వ్యవహా రం చట్టపరంగా మరో కీలక దశకు చేరుకుంది.
సత్యం కంప్యూటర్ స్కామ్‌పై గతంలో సీబీఐ విస్తృతంగా విచారణ జరిపింది.అయితే, ఆ విచారణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాల భూముల అంశం పూర్తిగా వెలుగులోకి రాలేదని సమాచారం… జన్వాడతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీగా లావాదేవీలు జరగడం, వాటి ద్వారా అక్రమంగా నిధులు మళ్లించారని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అక్రమంగా సంపాదించిన సొమ్మును కొనుగోళ్ల ద్వారా దాచిపెట్టారని ఈడీ అభియోగం మోపారు. తాజాగా అభినవ్ వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకు రావడంతో, ఈ కేసులో కొత్త అంశాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
